ప్రముఖ గాయకుడిని చంపేస్తామంటూ బెదిరింపులు, పోలీసు విచారణలో...
ప్రముఖ సినీ గాయకుడు ఉదిత్ నారాయణ్‌ను చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. గత నెల రోజుల నుంచి ఇలాంటి పోన్ కాల్స్ వస్తుండటంతో ఆయన ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అంబోలి పోలీసులు ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్‌కు చెందిన యాంటీ ఎక్స్‌టోర్షన్ సెల్(ఏఈసి)కి బదిలీ చేశారు. కేసును విచారించిన పోలీసులు ఈ ఫోన్ కాల్స్ దొంగిలించబడిన ఫోన్ నుంచి వస్తున్నట్లు, ఫోన్ చేస్తున్న వ్యక్తిని లక్ష్మణ్‌గా గుర్తించారు.
అంబోలి పోలీస్ట్ స్టేషన్‌కు చెందిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ భరత్ గౌక్వాడ్ మాట్లాడుతూ... 'నాలుగు రోజుల క్రితం ఉదిత్ నారాయణ్ ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆయన ఉండే ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచాం.' అని తెలిపారు.

పోలీసుల విచారణలో ఫోన్ నెంబర్ ఉదిత్ నారాయణ నివాసం ఉంటున్న బిల్డింగ్ సెక్యూరిటీ గార్డు మీద రిజిస్టర్ చేయబడి ఉందని తేలింది. వాచ్‌మెన్‌ను విచారించగా... తన ఫోన్ నెల రోజుల క్రితం సొంతూరికి వెళ్లి వస్తుండగా ఎవరో దొంగిలించారని తెలిపారు.
ఉదిత్ నారాయణ్ జన్మతహ నేపాల్ దేశానికి చెందిన ఒక నేపథ్య గాయకుడు. 2016లో భారత ప్రభుత్వము ఈయనకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. పలు భారతీయ భాషలతో పాటు ఈయన తెలుగులో కూడా కొన్ని ప్రజాదరణ పొందిన సినీ గీతాలు ఆలపించాడు.


Click it and Unblock the Notifications











