Salaar Benefit Show: సలార్ థియేటర్ దగ్గర అపశృతి.. ఫ్యాన్స్‌ను ఉరికించి కొట్టిన పోలీసులు.. ఎందుకంటే!

ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అంతా వేయి కళ్లతో ఎదురు చూసిన రోజు రానే వచ్చేసింది. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ అండ్ క్రేజీ యాక్షన్ మూవీగా పేరు తెచ్చుకున్న 'సలార్' మూవీ ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి వచ్చింది. సుదీర్ఘ కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తోన్న ప్రభాస్ ఈ సారి గట్టిగా కొట్టాలన్న కసితో చేసిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే తెరకెక్కిన 'సలార్' తాజాగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు పోలీసులు షాకిచ్చారు. ఆ వివరాలు మీకోసమే!

సలార్‌గా వచ్చేసిన ప్రభాస్ : రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన చిత్రమే 'సలార్'. ఈ మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు సహా ఎంతో మంది నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చాడు.

Police Lathi Charge on Prabhas Fans At Salaar Movie Theatre

గ్రాండ్‌గా రిలీజ్... హవానే : రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వేల సంఖ్యలో విడుదల చేశారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకుల గోలతో దద్దరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్నీ కళకళలాడుతున్నాయి. ఇలా ఈ చిత్రం హవాను చూపిస్తోంది.

1 గంటల షోలూ ఫుల్‌గా : హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి సంబంధించిన బెనిఫిట్ షోలను రాత్రి 1 గంటకు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం పర్మీషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలోని ప్రధాన థియేటర్లలో 1 గంటకే షోలు ప్రదర్శితం అయ్యాయి. అన్ని చోట్లా ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది.

జాతరలా ఆర్టీసీ ఏరియా : సాధారణంగా ఏదైనా పండుగ సమయంలో ఊర్లలో జాతరలు జరుగుతూ ఉంటాయి. అందుకోసం లైటింగ్స్ పెట్టి, పటాసులు కాల్చి యమా సందడి చేస్తుంటారు. ఇప్పుడు 'సలార్: సీజ్‌ఫైర్' రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. అంతలా ప్రభాస్ అభిమానులు ఈ సినిమా విడుదలను ఓ పండుగల జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

పోలీసులు లాఠీచార్జ్‌తో : అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకుంటోన్న సమయంలో 'సలార్: సీజ్‌ఫైర్' హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద అపశృతి చోటు చేసుకుంది. రాత్రి 1 గంటకు సినిమా షో ప్రదర్శితం అయ్యే సమయంలో పోలీసులు ప్రభాస్ అభిమానులపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు ఫ్యాన్స్‌కు గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది.

ఎందుకు చేశారంటే : రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ 1 గంట షో చూసేందుకు వందల సంఖ్యలో అభిమానులు సంధ్య థియేటర్ వద్దకు వచ్చారు. వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో వాళ్లపై లాఠీచార్జ్ చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియోలో ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X