‘దేనికైనా రెడీ’ సినిమాపై మరో వివాదం
వివాదాస్పద చిత్రం దేనికైనా రెడీ చిత్రం మళ్లీ వార్తల్లోకెక్కింది. హిందువుల మనోభావాలను, బ్రాహ్మణ సమాజ ఆచార, వ్యవహారాలను కించపరిచేలా సినిమా ఉందంటూ జనగామకు చెందిన బ్రాహ్మ ణ సేవా సమాఖ్య సహాయ కార్యదర్శి వారణాసి పవన్ కుమార్‌శర్మ, స్థానిక ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు.చిత్రాన్ని నిషేధిస్తూ నిర్మాత మోహన్‌బాబు, నటుడు మంచు విష్ణు సహా ఏడుగురిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని కోరారు.
సినిమాలో రెండు మతాల క్యారెక్టర్లతో చండీయాగం జరిపించడం, బ్రాహ్మణుల భార్యలను తక్కువ చేస్తూ డైలాగులు చెప్ప డం వంటి అంశాలపై 420, 295ఏ, 29 153 ఏ ఆర్/డబ్ల్యూ, 120బీ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. స్పం దించిన జడ్జి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జనగామ ఠాణా ఎస్‌హెచ్‌వోను ఆదేశించారు.


Click it and Unblock the Notifications












