twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాజీ ప్రధాని భార్యపై పాయల్ సంచలన వ్యాఖ్యలు.. నటిపై పోలీస్ కేసు ఫైల్

    |

    మాజీ ప్రధాని, దివంగత జవహర్‌లాల్‌ నెహ్రూ భార్య గురించి సంచలన వ్యాఖ్యలు చేసి ఇక్కట్ల పాలైంది నటి పాయల్. ఆమె తీరును తప్పుబడుతూ ఓ వ్యక్తి చేసిన ఫైరయ్యాడు మేరకు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఇంతకీ పాయల్ చేసిన కామెంట్స్ ఏంటి? కేసు వరకూ ఎందుకొచ్చింది? వివరాల్లోకి పోతే..

    నటి పాయల్.. సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యేలా

    నటి పాయల్.. సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యేలా

    కొద్ది రోజుల క్రితం సినీ నటి పాయల్ నెహ్రూ కుటుంబంపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు అందుకు సంబంధించిన వీడియోను తన ఫేస్‌బుక్‌ ద్వారా పోస్ట్‌ చేసి సంచలనాలకు తెరలేపింది. దీంతో ఒక్కసారిగా ఆమె గురించి దేశవ్యాప్తంగా చర్చలు ముదిరాయి. ప్రస్తుతం ఈ ఇష్యూ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

    ఇష్యూ వైరల్.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

    ఇష్యూ వైరల్.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

    స్వాతంత్య్ర సమరయోధుడు మోతీలాల్ నెహ్రూతో పాటు ఆయన కుమారుడు, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ భార్యపై ఆమె చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో ఇది గమనించి రాజస్థాన్‌కు చెందిన చర్మేశ్‌ శర్మ అనే ఓ కాంగ్రెస్‌ కార్యకర్త పాయల్‌ రోహత్గి మీద పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశాడు.

    దేశ ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో..

    దేశ ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో..

    అనంతరం మీడియాతో మాట్లాడిన శర్మ.. జవహర్‌ లాల్‌ నెహ్రూ తండ్రి మోతీ లాల్‌ నెహ్రూతో పాటు ఆయన భార్య, తల్లిని కూడా అవమానిస్తూ పాయల్ అనుచిత వ్యాఖ్యలు చేసిందని, లాల్‌బహుదూర్‌ శాస్త్రి మరణం గురించి కూడా అభ్యంతరకరంగా మాట్లాడిందని అన్నాడు. ప్రజల్లో తప్పుడు అభిప్రాయం నెలకొనేలా ఆమె పోస్ట్ చేసిన వీడియో ఉందని, దేశ ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నాడు. అందుకే ఆమె తీరుపై పోలీసులకు కంప్లైంట్ చేశానని అన్నాడు.

    ఇంతకీ ఎవరీ పాయల్? కేసు ఫైల్

    ఇంతకీ ఎవరీ పాయల్? కేసు ఫైల్

    పాయల్ పూర్తి పేరు పాయల్ రోహత్గి. ఈమె పలు హిందీ టీవీ, పలు రియాలిటీ షోల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కొన్ని బాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటించింది. 2008లో బిగ్‌బాస్‌ షోలో కూడా ఆమె పాల్గొంది. ఇక ఆమెపై నమోదైన ఫిర్యాదు మేరకు ఐటీ చట్టంలోని సెక్షన్ 66, 67 కింద రాజస్థాన్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.

    English summary
    Rajasthan Police registered a case against TV actress Payal Rohatgi. The complaint was filed by Youth Congress leader Charmesh Sharma and the case was registered under sections 66 and 67 of the IT Act.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X