పవర్ స్టార్ వివాదం: వెనక్కి తగ్గిన RGV.. దాడి చేసిన వారిని వదిలేసిన పోలీసులు
మొత్తానికి చాలా రోజుల తరువాత రామ్ గోపాల్ వర్మ పేరు మీడియాలో మారుమ్రోగిపోయింది. గత రాత్రి ఆయన ఆఫీస్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ జీవితంపైనే సినిమా తీసి ఇది ఎవర్ని కించపరిచేలా తీయలేదని కల్పిత కథ అంటూ వర్మ ఇన్ డైరెక్ట్ గా పవర్ స్టార్ సినిమాను ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఆయన కార్యాలయంపై దాడి జరగడంతో ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ అయ్యేలా చేశారు.

మరోసారి దాడి చేస్తే..
చూస్తుంటే వర్మ ఓ విధంగా ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. నేను ఎవరిని ఆఫీసుకు రమ్మనలేదు అంటూనే మరోసారి వస్తే రియాక్షన్ ఏంటో చూపిస్తానని మండిపడుతున్నారు. ఇక గురువారం సాయత్రం వర్మ కార్యాలయంపై దాడి చేసిన వారిపై మొదట ఆయన సన్నిహితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

కేసును వెనక్కి తీసుకున్న వర్మ
కేసు నమోదు చేయగానే దాదాపు 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కొంత సేపటి తరువాత వారిని రిలీజ్ చేశారు. వర్మ ఆ కేసును వెనక్కి తీసుకోవడం అందుకు కారణమని తెలుస్తోంది. ఇక దాడి జరిగిన వెంటనే వర్మ వరుస ఇంటర్వ్యూలతో పలు మీడియా ఛానెల్స్ తో మాట్లాడారు. ఘటనపై వివరణ ఇస్తూ సినిమా గురించి కూడా తెలియజేశారు.

పవర్ స్టార్ ప్రమోషన్స్..
జరిగిన ఘటనపై స్పందించిన వర్మ పనిలో పనిగా పవర్ స్టార్ సినిమా బజ్ కూడా పెంచే ప్రయత్నం చేశారు. ఇక సోషల్ మీడియాలో కూడా గ్యాప్ లేకుండా ట్వీట్స్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ కి ఛాలెంజ్ విసురుతున్నారు. ఇక మీడియాలో మాట్లాడిన వర్మ మునుపెన్నడు లేనంత ఆగ్రహంతో కనిపించడం విశేషం.
Recommended Video

గాజులు తొడుక్కొని కూర్చోలేదు
తాను గాజులు తొడుక్కొని కూర్చోలేదు అంటూ యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది కదా అందుకే నా స్టైల్ లో సమాధానం ఇచ్చానని అన్నారు. పవర్ స్టార్ సినిమాపై మరో వివరణ ఇస్తూ.. నేను పవన్ కళ్యాణ్ పై సినిమా తీసి ఉండకపోవచ్చు. కానీ ఆ సినిమా చూసిన తరువాత పవన్ ఫ్యాన్స్ చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతారు. నమ్మకం లేకపోతే సినిమా చూసిన తరువాత మాట్లాడండి అంటూ వర్మ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











