పట్టపగలు మద్యం మత్తులో హీరోయిన్, స్నేహితుల వీరంగం
బెంగుళూరుకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ రమేష్ దిమ్లా, కన్నడ నటి మాధురి, మరికొందరు స్నేహితులు రోడ్డుపై మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పట్టపగలు జరిగిన ఈ సంఘటనతో స్థానికులు విస్తుపోయారు. బెంగుళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రమేష్ దిమ్లా, మాధురితో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
బెంగుళూరు నార్త్ జోన్ డీసీపీ సందీప్ పాటిల్ సంఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. శుక్రవారం ఉదయం మల్లేశ్వరం ప్రాంతంలో 17వ క్రాస్ వద్దకు లగ్జరీకారు నెం. KA 05 NK 7275లో చేరుకున్న వీరు నడిరోడ్డుపై నిల్చుని బీర్లు తాగారు. నటి మాధురితో పాటు యువతులు అసభ్యంగా అర్థనగ్న దుస్తువులు వేసుకుని కనిపించారు.

రోడ్డుపై వీరు మద్యం తాగుతూ, అర్ధనగ్న దుస్తువులతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో రమేష్ దిమ్లా స్థానికులతో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ పెద్దది కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ తతంగాన్ని కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించి టీవీ ఛానల్స్‌కు అందించారు. దీంతో ఈ సంఘట బెంగుళూరులో సెన్సేషన్ అయింది. దీంతో డీసీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంఘటన గురించి వివరించారు. కొందరు మద్యం సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలినట్లు తెలిపారు. వారిని వదిలి పెట్టాలని తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, విచారన అనంతరం కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications











