»   » అవి లేకుండా రావొద్దు : పవన్ ఫ్యాన్స్‌కు వార్నింగ్!

అవి లేకుండా రావొద్దు : పవన్ ఫ్యాన్స్‌కు వార్నింగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఆడియో ఈ నెల 19 విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆడియో వేడుక జరుగనుంది. ఈ నేపథ్యంలో నగర పోలీసు విభాగం ఈ ఆడియో వేడుక కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించింది.

గతంలో హైదరాబాద్‌లో జరిగిన ఓ ఆడియో వేడకలో అభిమాని మృతి చెందిన నేపథ్యంలో ఈ ఆడియో వేడుక నిర్వాహకులకు పోలీసులకు కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. సీటింగ్ పరిమితి మేరకే పాసులు జారీ చేయాలని ఆదేశించారు. లోనికి వచ్చే వారిని క్షుణ్ణంగా చెక్ చేసేందుకు భద్రతా పరికాలతో పాటు, భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే నేపథ్యంలో తోపులాట జరిగే అవకాశం ఉండటంతో వారిని కంట్రోల్ చేసేందుకు అవసరమైన సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించనున్నారు.

కేవలం పాసులు అందిన వారు మాత్రమే ఆడియో వేడుక ప్రాంగణానికి రావాలని, పాసులు దొరుకుతాయనే ఆశతో మాత్రం రావొద్దని సూచిస్తున్నారు. అదే విధంగా ఇతర జిల్లాల నుంచి వచ్చే అభిమానులకు కూడా పోలీసులు ఇలాంటి సూచనలే చేస్తున్నట్లు తెలుస్తోంది.

కొంత మంది అభిమానులు పాసులు లేకున్నా ఆడియో వేడుక ప్రాంగణం బయట రోడ్డు పక్కన తిష్టవేయడం, తమ అభిమాన హీరో ఆ మార్గం గుండా వెలుతుంటే చూద్దామనే కూతూహలంతో ఇక్కడి వరకు రావడం లాంటి ఘటనలు గతంలో పలు ఆడియో వేడుకల్లో చోటు చేసుకున్నాయి. పాసులు లేని వారంతా ఇలా రోడ్డుపై చేరడంతో న్యూసెన్స్‌కు కారణం అవడంతోపాటు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

కాగా..ఆగస్టు 7న సినిమా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Hyderabad Police special focus on Power Star Pawan Kalyan’s ‘Atharintiki Dharedhi’ audio event. Audio will be released at a special function that will be held on the 19th at Shilpa Kala Vedhika.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu