హీరోయిన్ తీరుపై చుట్టుపక్కల వారి ఫిర్యాదు, పోలీసుల ఎంట్రీ
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు తన స్నేహితులతో కలిసి ఎంతో గ్రాండ్‌గా ఏర్పాటు చేసుకున్న బర్త్ డే పార్టీ పోలీసుల రంగ ప్రవేశంతో......స్పాయిల్ అయింది. దీంతో ఎంతో సంతోషంగా ఉండాల్సిన బర్త్ డే ఆమెకు డిసప్పాయింట్ డేగా మారింది. మంగళవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
జనవరి 7న బిపాసా బసు 35వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో తన బాయ్ ఫ్రెండ్ హర్మాన్ బజావేతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించి గ్రాండ్‌గా బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసింది. పార్టీలో భారీ లౌడ్ స్పీకర్లతో మ్యూజిక్ ఏర్పాట్లు చేసారు. బిపాసా ఇంటి టెర్రస్‍పైన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంతో....లౌడ్ స్పీకర్ల గోల తట్టుకోలేక ఆమె ఇంటి చుట్టుపక్కల నివాసం ఉండే వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
తొలుత పోలీసులు బిపాసా బసు స్పాట్ బాయ్‌ని పిలిపించి బిపాసా ఇంట్లో ఏం జరుగుతుందనే విషయమై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతను పోలీసులు వచ్చిన విషయాన్ని బిపాసా దృష్టికి తీసుకెళ్లాడు. అనంతరం బిపాసా పార్టీలో మ్యూజిక్ గోల తగ్గించడంతో సమస్య పరిష్కారం అయిందని, పోలీసులు అక్కడి నుండి వెళ్లి పోయినట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఈ పరిణామాల నేపథ్యంలో....బిపాసా బసు బర్త్ డే బాష్ అనుకున్న విధంగా జరుగలేదని స్పష్టం అవుతోంది. బిపాసా బసు జనవరి 7, 1979లో ఢిల్లీలో జన్మించింది. అనంతరం వారి ప్యామిలీ కోల్ కతాకు షిప్టయింది. చదువయ్యాక మొడలింగ్‌లో ప్రవేశించి అనంతరం 2001లో అజ్‌నబీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించింది.


Click it and Unblock the Notifications












