అల్లు అర్జున్ త్రాగి డ్రైవ్ చేస్తున్నాడా? (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో కి సంభందించిన ఏదైనా జనాల్లోకి స్పీడుగా వెళ్లిపోతుంది. రీసెంట్ గా ఐయామ్ దట్ ఛేంజ్ షార్ట్ ఫిల్మ్ విడుదల చేసిన తర్వార అల్లు అర్జున్ కు చెందిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/ZyefY1ZwI24" frameborder="0" allowfullscreen></iframe></center>

రాత్రిపూట హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రొటీన్ చెకప్ లో భాగంగా అల్లు అర్జున్ ని ఆపుచేసి పంపేసారు. అయితే ఈ వీడియోని చూసిన వారు కొందరు అల్లు అర్జున్ త్రాగి డ్రైవ్ చేస్తున్నాడంటూ కామెంట్ చేస్తూండగా...త్రాగి డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా పోలీసులు ఆపుదురు..అలాంటిదేమి లేదని మరికొందరు అంటున్నారు. నిజానిజాలు తెలియకపోయినప్పటికీ ఈ వీడియో మాత్రం సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో వెబ్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందుతోంది.

 Police Stop To Allu Arjun For Check Drunk Or Not

సినిమాల విషయానికి వస్తే...

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'రుద్రమదేవి'. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గోన గన్నారెడ్డి అనే కీలక పాత్రను అల్లు అర్జున్‌ పోషిస్తున్నాడు. ఆయన పాత్ర చిత్రీకరణ సోమవారంతో పూర్తయింది.

గుణశేఖర్‌ మాట్లాడుతూ ''గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్‌ చక్కగా నటించాడు. పీటర్‌ హెయిన్స్‌ సారథ్యంలో బన్నీపై చిత్రీకరించిన పోరాట సన్నివేశాలు చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తాయి. సినిమా చిత్రీకరణ చివరి దశకొచ్చింది'' అన్నారు. చిత్రంలో రానా, నిత్య మీనన్‌, కేథరిన్‌, సుమన్‌, కృష్ణంరాజు, ప్రకాష్‌రాజ్‌ తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కళ: తోట తరణి, ఛాయాగ్రహణం: అజయ్‌ విన్సెంట్‌, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X