పవన్ అభిమానిపై దాడి: పోలీసుల అదుపులో నలుగురు
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అభిమానిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో కుమార స్వామి, నరేష్ కుమార్, రాకేష్, రంజిత్ అనే వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
‘గోపాల గోపాల' ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా ఓ అభిమానిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి గొంతు కోసిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానిపై ‘గోపాల గోపాల' ఆడియో వేడుక వద్ద దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. దాడి ఘటన తనను ఎంతగానో డిస్ట్రబ్ చేసింది. నేను స్వయంగా వెళ్లి కలుస్తాను. ఇలాంటి జరుకుండా చూడాలని రిక్వెస్ట్ చేసారు. మరుసటి రోజు స్వయంగా అభిమానిని తన కార్యాలయంలో కలిసారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 50 వేల ఆర్థిక సహాయం అందించారు.

ఈ ఆడియో పంక్షన్ టికెట్లు ఇవ్వలేదని దుండగులు పవన్‌కల్యాణ్ అభిమాని గొంతు కోసి పారిపోయారు. ఈ ఘటన ఆదివారం శిల్పకళా వేదిక వద్ద జరిగింది. గుంటూరు జిల్లా గంటవారిపాలెంకు చెందిన కరుణ శ్రీనివాస్ (31) పవన్ కల్యాణ్ అభిమాన సంఘం వినుకొండ నియోజకవర్గం అధ్యక్షుడు. హయత్‌నగర్‌లోని గంటవారిపాలెంలో నివాసముంటున్నాడు. వెంకటేష్, పవన్‌కల్యాణ్ నటించిన గోపాల-గోపాల సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు సంబంధించిన 20 టికెట్లను వేదిక వద్ద తన స్నేహితులకిస్తుండగా దుండగులు వచ్చి తమకూ కావాలని అడిగారు. నిరాకరించిన శ్రీనివాస్ గొంతు, మెడపై బ్లేడ్‌తో దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో కుప్పకూలి న శ్రీనివాస్‌ను అక్కడే ఉన్న పోలీసులు మాదాపూర్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి ప్రాణహాని తప్పింది.


Click it and Unblock the Notifications