మెక్సికన్లు ఉన్న ప్రాంతంలో.. వ్యభిచారం చేసిన హీరోయిన్స్‌ని చూసిన మెక్సికన్, బయట పడ్డ నిజాలు!
Recommended Video

టాలీవుడ్ సెక్స్ రాకెట్ విషయంలో తవ్వే కొద్దీ సంచలనం నిజాలు బయటకు వస్తున్నాయి. అమెరికా పోలీసులు ఈ కేసు గురించి లోతుగా విచారణ జరుగవుతున్నారు. ఫెడరల్ కోర్టులో ప్రస్తుతం టాలీవుడ్ సెక్స్ రాకెట్ వ్యవహారానికి సంబందించిన కేసు నడుస్తోంది. కిషన్ మోడుగుముడి, అతడి భార్య చంద్ర కలసి ఈ దందాని రెండు అపార్టుమెంట్లలోని ఫ్లాట్స్ లో నిర్వహించేవారని యూఎస్ పోలీసులు విచారణలో కనుగొన్నారు.

తెలుగు వారులేని ప్రాంతంలో
కిషన్, చంద్ర దంపతులు నివాసం ఉంటున్న ఆ ప్రాంతంలో తెలుగువారు.. ఆ మాటకి వస్తే ఒక్క ఇండియన్ కూడా లేనిప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తేలింది. 1 ఈ, 1 యు యు అనే రెండు అపార్ట్ మెంట్స్ లోని రెండు ఫ్లాట్స్ లో వీరిద్దరూ టాలీవుడ్ హీరోయిన్స్ చేత వ్యభిచార దందా నిర్వహించేవారని తేలింది.

చైనీస్, మెక్సికన్స్ ఎక్కువగా
వీరు ఉంటున్న ప్రాంతంలో చైనీస్, మెక్సికన్స్ ఎక్కువగా ఉంటున్నారు. కిషన్ దంపతులు నివాసం ఉంటున్న ఫ్లాట్స్ లో అధికశాతం మంది మెక్సికన్లే కావడం విశేషం. వీరు సాగించే అసాంఘిక కార్యకలాపాలకు అనుమానం రాకుండా ఉండేందుకు ఇండియన్స్ లేని ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఎవరితో మాట్లాడే వారు కాదు
కిషన్, చంద్ర దంపతులు కనీసం ఇరుగుపొరుగు ఫ్లాట్స్ వారితో కూడా ఎప్పుడూ మాట్లాడేవారు కాదట. వీరిద్దరూ అరెస్ట్ అయిన సంగతి కూడా అపార్ట్ మెంట్ ఓనర్ చెబితేనే తెలిసిందని ఇరుగుపొరుగువారు అంటున్నారు.

మెక్సికన్ స్పందన
మెక్సికన్ అయిన కకిషన్ పక్క ఫ్లాట్ లో ఉంటున్న వ్యక్తి మీడియాతో ఈ వ్యవహారం పై స్పందించాడు. కిషన్ ఫ్లాట్ కు తరచుగా అందమైన అమ్మాయిలు వస్తుండడం తాను గమనించానని తెలిపాడు. కానీ ఏం జరుగుతుందో అర్థం అయ్యేది కాదని తెలిపాడు. భారీగా లగేజ్ బ్యాగులతో యువతులు ఈ ఫ్లాట్స్ కు వచ్చేవారని అతడు తెలిపాడు.

వీసాలు రిజెక్ట్
టాలీవుడ్ సెక్స్ రాకెట్ వ్యవహారంలో పలు తెలుగు సంఘాలని కూడా యుఎస్ పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మందికి అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసాలు రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











