అదృష్టం బాగుంది : ఆశీష్ విద్యార్దికి తప్పిన ప్రమాదం
హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులకు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చిరపరిచితుడైన ఆశీష్ విద్యార్దికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన రాయ్ పూర్ దగ్గరలోని బిలాయ్ సమీపంలో ఓ చిత్రం షూటింగ్ నిమిత్తం వెళ్లారు. అక్కడ షూటింగ్ లో భాగంగా నీళ్లలో ఉండగా ఒక్కసారిగా వరద వచ్చేసింది. అయితే అదృష్టవశాత్తు అక్కడే ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆయన్ను కాపాడారు.

వివరాల్లోకి వెళితే.... బాలీవుడ్ డైరీ అనే టైటిల్ తో రూపొందుతున్న చిత్రం నిమిత్తం ఆశిష్ విధ్యార్ది బిలాయి వెళ్లారు. అక్కడ నదిలో నిలబడి ప్రార్ధించే సన్నివేశం జరుగుతోంది. అదే సమయంలో ఒక్కసారిగా నదిలో వరద ఉదృతి పెరిగింది. ఊహించని విధంగా వచ్చిన ఆ నీటి నుంచి తప్పించుకోలేక ఆశిష్ విధ్యార్ది మునిగిపోతూండగా...అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ వికాస్ సింగ్ వెంటనే నీటిలోకి దూకారు. ఆయన్ను రక్షించి ఒడ్డుకు చేర్చారు.
ఆశిష్ విధ్యార్ది మాట్లాడుతూ... ఈ సంఘటనతో తాను చాల భయాందోళనకు గురి అయ్యినట్లు తెలిపారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఆయన తన తోటి నటీనటులకు సూచించారు. ఈ ప్రమాధం తనకు ఓ పాఠమని అన్నారు.


Click it and Unblock the Notifications