Bhagath Blaze పవన్ కల్యాణ్ చేతిలో గాజు గ్లాసు.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు.. ఈసీ ఏమన్నదంటే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన భగత్ బ్లేజ్ అనే ప్రమోషనల్ వీడియోను ఇటీవల రిలీజ్ చేయడంపై ప్రత్యర్థి రాజకీయ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమా టీజర్‌లో గాజు పగిలితేనే రాటుదేలుతుంది. గాజు అంటే సైజు కాదు.. సైన్యం.. అది కనిపించని సైన్యం అంటూ ఓ గాజు గ్లాసును చూపిస్తూ పవన్ డైలాగ్స్ చెబుతాడు. ఆ విషయంపై ఫిర్యాదులు అందడంపై తాజాగా జరిగిన ఎన్నికల సంఘం ప్రెస్ మీట్‌లో ఈ వివాదంపై అధికారి మాట్లాడుతూ..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజైన భగత్ బ్లేజ్ వీడియోను నేను చూడలేదు. అందుకే దానిపై నేను కామెంట్ చేయలేను. ఆ గ్లాస్ చూపించి పబ్లిసిటీ చేస్తే..పొలిటికల్ పబ్లిసిటీ కిందకు వస్తుంది. అలాంటి పబ్లిసిటీ చేసుకోవచ్చు. అలాంటి పబ్లిసిటీ చేసుకోవాలంటే ముందస్తు అనుమతి అవసరం అని ఏపీ, తెలంగాణకు చెందిన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ స్పందించింది.

AP Elections 2024-Bhagat-Blaze

ఉస్తాద్ భగత్ సింగ్ వీడియోను ఇంకా చూడలేదు. చూసిన తర్వాత దానిపై స్పందిస్తాను. ఒకవేళ పొలిటికల్ పబ్లిసిటీ కిందకు వస్తే వారికి నోటీసులు జారీ చేస్తాం. ఇంకా దానిని నేను చూడలేదు కాబట్టి నేను కామెంట్ చేయలేను. వాళ్ల జాబ్ కాబట్టి అదే చేస్తారు అని ఈసీ అధికారి స్పందించారు.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని టీజర్ లాంటి దానిలో ఆ గ్లాసును ఎలా చూపించారనే చూడాలి. మేము చూసిన తర్వాత అది పొలిటికల్ పబ్లిసిటీ కిందకు వస్తుందా? రాదా? అని నిర్ధారించాలి. ఆ తర్వాతే దానిపై మేము స్పందిస్తాం. మీరు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి మేము దానిని చూస్తాం అని ఈసీ అధికారి చెప్పారు.

ఎన్నికల గుర్తులు ఏవైనా ఉండొచ్చు. నేను కూర్చొన్న టేబుల్, మైక్, సైకిల్, ఫ్యాన్ ఎదైనా ఉండొచ్చు. మనం వాడే వస్తువులు అన్నీ ఉంటాయి. కానీ వాటిని పబ్లిసిటీ కిందకు పరిగణించలేం. అందుకే మేము చూసిన తర్వాత దాని గురించి నిర్ణయం తీసుకొంటాం అని ఈసీ అధికారి చెప్పారు. అభ్యర్థులు ఖర్చు చేసే విషయంలో మేము ఇంకా చర్యలు తీసుకోలేదు. నామినేషన్ల తర్వాత అభ్యర్తి ఖర్చును ట్రాక్ చేస్తాం అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X