‘శంబో శివ శంబో’ లేడీ విలన్ గా రోజా
సినీ గ్లామర్ తెచ్చిపెట్టిన పేరు రాజకీయ రంగ ప్రవేశానికి మార్గం సుగమం చేస్తుంటుంది. ఎందుకంటే సినీ గ్లామర్ కూ, రాజకీయాలకు ఎప్పట్నించో విడదీయరాని బంధం ఉంది.నాటి ఎన్టీయార్ నుండి నేటి చిరంజీవి వరకూ రాజకీయాలకు సినిమాలకు అవినాభావ సంబందమున్నట్లు తెలుస్తుంది. సినీరంగంలో పోటీ ఉన్నా ఎవరి అవకాశాలు వారికి ఉండనే ఉంటాయి.తెలుగులో అగ్రహీరోలందరితోనూ నటించిన రోజా ఇటీవల అసెంబ్లీ ఫలితాల్లో ఎదురైన చేదు అనుభవంతో మరోసారి రెండవ ఇన్నింగ్స్ కి రెడీ అవుతున్నారు. తెలుగు మహిళా ధ్యక్షురాలు హోదాలో ఉన్న రోజా ఇటీవల చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి గల్లా అరుణకుమారి చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమిని రోజా ఇప్పటికీ జీర్ణించుకోలేకున్నారు. మళ్లీ ఎలెక్షన్లకు చాలాకాలం ఉండటంతో ఇప్పుడు సినిమాల్లో మరో ఇన్నింగ్స్ కు రోజా రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే తమిళంలో విజయవంతమైన 'నానోడిగల్' తెలుగు రీమేక్ లో రోజా ఈ కీలక పాత్రను పోషించబోతున్నారు.
'శంబో శివ శంబో" చిత్రంలోరవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ, సునీల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. తమిళ వెర్షన్ దర్శకుడు సుముతిరకని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు తెరకు కూడా పరిచయమవుతున్నారు. తమిళంలో లేడీ విలన్ ప్రభ పాత్రలో రోజా నటించబోతున్నట్టు సమాచారం. రోజా ఆహార్యం, వాయిస్ ఈ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు సరిగ్గా సరిపోతాయని అనుకోవచ్చు. రోజా విలన్ పాత్ర విజయవంతమైతే మరిన్ని అవకాశాలు ఆమెను వరించడం ఖాయం.


Click it and Unblock the Notifications











