జయప్రద సినిమాలో లాలూ, అమర్, శతృఘ్ను
బాలీవుడ్ స్టార్ శతృఘ్నుసిన్హా కూడా కీలక పాత్ర పోషించారు. జయప్రదతో తనకున్న స్నేహం కారణంగా ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకొన్నట్టు సిన్హా వెల్లడించారు. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని తివారి చెప్పారు.
బప్పీలహరి సంగీతాన్ని అందిస్తున్నారన్నారు. వ్యాపారవేత్తగా లాలూ, గృహ యజమానిగా సిన్హా నటించారని తెలిపారు. లాలూ గతంలో "పాదం శ్రీ లాలూ ప్రసాద్ యాదవ్'' అనే హిందీ చిత్రంలో నటించారు. రాజకీయాల్లో నిరుపేదల గురించి మాట్లాడే లాలూ ఈ సినిమాలో పారిశ్రామికవేత్త పాత్ర ధరిస్తున్నారు. శతృఘ్ను సిన్హా అనాథాశ్రమం యజమానిగా నటిస్తున్నారు.
ఇది మసాలా చిత్రం కాదని, సీరియస్ చిత్రమని, శక్తివంతమైన సందేశం అందిస్తుందని తివారీ చెప్పారు. తాగుడుకు బానిసైన వ్యక్తి కుటుంబం ఎలా చితికిపోతుందో చెప్పే చిత్రం ఇది. తివారీ మద్యానికి బానిస అయిన వ్యక్తి పాత్రను పోషిస్తుండగా, జయప్రద ఆయన భార్య పాత్రలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications












