Roja నిన్ను అలా వాటేసుకొంటా.. రా! సినీ నటి రోజాపై పృథ్వీరాజ్ సెటైర్స్

ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం వేసవి కాలానికి మించి వేడెక్కుతున్నది. ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలను సంధించుకొంటున్నారు. సంచలన ఆరోపణలతో ఒకరిపై మరొకరు బురద జల్లుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ వివరాల్లోకి వెళితే..

ఆంధ్రాలో మంత్రులు తాము చేసిన అభివృద్ధి గురించి చెప్పడం మానేసి.. చిల్లర విమర్శలు చేస్తున్నారు అంటూ పృథ్వీరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల కాలంలో వారు చేసిన మంచి పనులు చెప్పకుండా పవన్ కల్యాణ్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. గత పాలనతో ఏపీలో అభివృద్ధి శూన్యం అంటూ కామెంట్ చేశారు.

Politics Actor Prudhvi Raj contraversial Comments on AP Minister Roja

ఏపీలో రైతులు, భవన నిర్మాణ కార్మికులు, ఉద్దానం లాంటి బాధితులను పవన్ కల్యాణ్ ఆదుకొన్నారు. సొంత డబ్బుతో వారికి అందించి వందలాది కుటుంబాలను ఆదుకొన్నారు. ఏపీలో ఏ ఒక్క రాజకీయ నేత తన సొంత డబ్బులతో ఎవరికైనా సహయం చేశారా? అని పృథ్వీరాజ్ ప్రశ్నించారు.

ఏపీలో అభివృద్ది గురించి ప్రశ్నిస్తే మూడు పెళ్లిళ్లు అంటూ వ్యక్తిగత జీవితాన్ని ప్రజాక్షేత్రంలోకి లాగుతారు. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తుంటారు. తాను ప్రశ్నిస్తే తనను కూడా వ్యక్తిగతం టార్గెట్ చేస్తారు అని పృథ్వీరాజ్ అన్నారు.

Politics Actor Prudhvi Raj contraversial Comments on AP Minister Roja

ఏపీలో అభివృద్దిలో నెంబర్ అని చెప్పుకొనే మంత్రి, సినీ నటి రోజా అంతా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీలో అభివృద్దిలో 27వ స్థానంలో ఉందని పృథ్వీరాజ్ అన్నాడు. తాను రోజాను ప్రశ్నిస్తే తనపై చవకబారు కామెంట్స్ చేస్తున్నారని అన్నారు. వెనుక నుంచి వాటేసుకొన్నాడని వ్యాఖ్యలు చేస్తున్నది. రోజా రా.. నిన్ను ముందు నుంచే వాటేసుకొంటా అని ఘాటైన వ్యాఖ్యలతో ఆయన సమాధానం ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం మీడియాలో సంచలనం రేపుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X