నంది అవార్డుల ఎంపికలో రాజకీయం జరిగిందా?
మొన్న ఎనౌన్స్ చేసిన నంది అవార్డ్స్-2008లో కొన్ని రాజకీయాలు చోటు చేసుకున్నాయని వినిపిస్తున్నాయి. దీనికి ఊతం ఇస్తూ..తెలంగాణా జాగృతి ప్రెసిడెంట్ కవిత(కెసిఆర్ కుమార్తె) మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సమస్యలు,నేటివిటీని ప్రతిబింబిస్తూ తీసిన బతుకమ్మ చిత్రాన్ని కావాలనే పట్టించుకోలేదని ఆమె అన్నారు. చిత్రాలను అవార్డులకు ఎంపిక చేసి ప్రాసెస్ లో తెలంగాణ నటులుకు, సాంకేతిక నిపుణులకు చాలా అన్యాయం జరిగిందని ఆమెఆరోపించారు. అలాగే పదహారు మంది మెంబర్స్ గల జ్యూరిలో కేవలం ఇద్దరు మాత్రమే తెలంగాణ వారు అని మిగిలిన వారు ఆంద్రావారు అని ఆమె అన్నారు.దాంతో వారు ఏ విధంగా బతుకమ్మ చిత్రంలో చూపిన తెలంగాణ సంస్కృతిని, ఆచారాలను అర్ధం చేసుకోగలరని ప్రశ్నించారు. కేవలం తెలంగాణ ప్రాంతీయుల మాత్రమే అర్ధం చేసుకోగలరని ఆమె అన్నారు. మినిమం ఆరుగురైనా తెలంగాణ ప్రాంతానికి చెందిన మెంబర్స్ జ్యూరీలో ఉండాలని ఆమె సూచించారు.ఇక బతుకమ్మ చిత్రాన్ని టి.ప్రభాకర్ డైరక్ట్ చేసారు. సింధు తులాని ప్రధానపాత్ర వహించారు. తెలంగాణని ప్రతిబింబిస్తూ తీసిన ఈ చిత్రం మంచి పేరు తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











