అంత దమ్ముందా?.... విజయ్ దేవరకొండపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎటాక్!

Recommended Video

NTR Fans Comments On Vijay Devarakonda Over Poll on NOTA Release

'గీత గోవిందం' సినిమాతో బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకున్న విజయ్ దేవరకొండ వచ్చే దాసరాకి తన 'నోటా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 4న రిలీజ్ అని చాలా రోజుల క్రితమే అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి నిన్న విజయ్ ట్విట్టర్లో ఓ పోల్ పెట్టారు. 'నోటా' రిలీజ్ డేట్ మార్చాలనుకుంటున్నాం. అక్టోబర్ 5, అక్టోబర్ 10, అక్టోబర్ 18 వీటిలో ఏదొకటి అర్జంటుగా చెప్పండి అంటూ అభిమానులను కోరాడు. అయితే ఇక్కడ అక్టోబర్ 10 అని ఆప్షన్ ఇవ్వడం ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

అంత దమ్ముందా? అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పైర్

అంత దమ్ముందా? అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పైర్

విజయ్ దేవరకొండ మీద ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం..... అక్టోబర్ 11న దసరా పురస్కరించుకుని ఎన్టీఆర్ మూవీ ‘అరవింద సమేత' రిలీజ్ ఉండటమే. అక్టోబర్ 10న నీ సినిమా రిలీజ్ చేసే దమ్ముందా? అంటూ మండి పడ్డారు.

వస్తే నీ పని అయిపోయినట్లే


ఒక వేళ అక్టోబర్ 10న నువ్వు ‘నోటా'తో వస్తే నీ పని అయిపోయినట్లే అంటూ కొందరు అభిమానులు బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. వేరే డేట్ చూసుకోవాలని మరికొందరు సూచించారు.

మరికొందరు విజయ్‌కి సపోర్టుగా

అయితే కొందరు ఎన్టీఆర్ అభిమానులు మాత్రం విజయ్‌కు సపోర్టుగా కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ తండ్రిని కల్పోయిన సమయంలో ఇండస్ట్రీ వారంతా అండగా ఉన్నారు అంటూ వ్యాఖ్యానించారు.

అక్టోబర్ 5 రిలీజ్ డేట్ ఫిక్స్

అక్టోబర్ 5 రిలీజ్ డేట్ ఫిక్స్

ఎన్టీఆర్ అభిమానుల నుండి వచ్చిన ట్వీట్స్ విజయ్ కూడా గమనించాడో? మరేంటో తెలియదు కానీ..... తన సినిమాను అక్టోబర్ 10న విడుదల చేసే ధైర్యం చేయలేదు. ఎక్కువ మంది అభిమానులు అక్టోబర్ 5కు మొగ్గు చూపడంతో అదే డేట్ ఫైనల్ చేశారు.

నోటా

నోటా

తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బేనర్లో కె.ఇ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. అనుకోకుండా సీఎం పీఠం ఎక్కిన విజయ్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు? రాజకీయ చదరంగంలో అతడు పావుగా మారాడా? లేక అందరినీ ఆటాడించాడా? అనే సినిమాలో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ఈ చిత్రంలో మెహ్రీన్ జర్నలిస్టుగా కనిపించబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X