twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వ్యభిచారాన్ని లీగల్ చేయండి.. నటి డిమాండ్!

    |

    మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకి సంబంధించిన సంఘటనలు దేశం నలుమూలల జరుగుతూనే ఉన్నాయి. తరచుగా ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. ఇటీవల తమిళనాడులోని పొల్లాచిలో వెలుగులోకి వచ్చిన లైంగిక వేధింపుల సంఘటన దేశం మొత్తాన్ని షాక్ కి గురిచేసింది. ఈ సంఘటనని తమిళ సినీ ప్రముఖులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. చాలా మంది సినీ ప్రముఖులు ఇప్పటికే పొల్లాచి ఘటన గురించి స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళ నటి సింధు ఈ ఘటన గురించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

     60 మంది మహిళలపై

    60 మంది మహిళలపై

    ఇటీవల పొల్లాచ్చిలో 60 మంది మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళకు చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన మొత్తం బయట పడింది. కొందరు వ్యక్తులు ఆ మహిళలని బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు తేలింది. ఈ సంఘటన సంచలనంగా మారడంతో తమిళ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందించింది.

     ఆ కుక్కలని దారుణంగా

    ఆ కుక్కలని దారుణంగా

    అంగాది తేరు చిత్రంతో సింధు మంచి గుర్తింపు తెచ్చుకుంది. పొల్లాచి సంఘటన గురించి మాట్లాడుతూ.. ఆ దుర్మార్గులని దారుణంగా చంపేయాలి. మానవత్వం లేని ఆ కుక్కలని ఉరితీయాలి. వారి గురించి ఇంతకంటే దారుణమైన భాష మాట్లాడాలని ఉంది. కానీ నా వ్యక్తిత్వం తగ్గించుకోవడం ఇష్టం లేదు అని సింధు తెలిపింది. విదేశాల్లో ఇలాంటి సంఘటన జరిగి ఉంటే నిందితులని ఇప్పటికే ముక్కలు ముక్కలుగా నరికేసే వాళ్ళు అని సింధు తెలిపింది. అలాంటి కఠినమైన చట్టాలు ఇంద్రియాలు ఎందుకు లేవు అని ప్రశ్నించింది.

    ప్రియుడితో బ్రేకప్?.. శృతిహాసన్ డేరింగ్ నిర్ణయం.. అంతా మంచే.. వైరల్‌గా ట్వీట్ప్రియుడితో బ్రేకప్?.. శృతిహాసన్ డేరింగ్ నిర్ణయం.. అంతా మంచే.. వైరల్‌గా ట్వీట్

     వివాదాస్పదంగా డిమాండ్

    వివాదాస్పదంగా డిమాండ్

    ఇలాంటి సంఘటనలు కొంతవరకైనా తగ్గాలంటే ప్రభుత్వాలు ఓ చట్టాన్ని తీసుకు రావాలని సింధు తెలిపింది. వ్యభిచారాన్ని లీగల్ చేయాలి. ముంబై లాంటి ప్రాంతాల్లో వ్యభిచారాన్ని లీగల్ చేశారు. అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు కొంతవరకు తగ్గాయి. తమిళనాడు ప్రభుతం కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. వ్యభిచారాన్ని లీగల్ చేస్తే ఇలాంటి వారినుంచి మహిళలకు కొంతవరకు అయినా రక్షణ కలుగుతుంది అని సింధు తెలిపింది. ఆమె డిమాండ్ వివాదాస్పదంగా మారింది.

     అమ్మాయిలపై విమర్శలు

    అమ్మాయిలపై విమర్శలు

    ఇలాంటి సంఘటనల విషయంలో సింధు అమ్మాయిలపై కూడా కొన్ని విమర్శలు చేసింది. మీ తల్లిదండ్రులు మీపై ఉన్నా భాద్యతలు గుర్తులేవు అని అనుకుంటున్నారా.. మీకు ఎప్పుడు పెళ్లి చేయాలో వారికీ తెలియదా.. మీ తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయాల గురించి మీరు ఆలోచింది ఇలాంటి మాయగాళ్లు వలలో చిక్కుకోవద్దు అని సింధు అమ్మాయిలని కోరింది.

    English summary
    Pollachi sexual assault: Actress Sindhu calls for legalising prostitution in Tamil Nadu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X