ప్రకాష్ రాజ్ భార్య సెక్సీగా డర్టీ డాన్స్
ప్రకాష్ రాజ్ భార్య, బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ పోని వర్మ ప్రస్తుతం డర్టీ డాన్స్ లో బిజీ గా ఉంది. విద్యా బాలన్ ప్రధాన పాత్రలో ఏక్తా కపూర్ నిర్మిస్తున్న డర్టి పిక్చర్ లో ఓ కీలకమైన పాటకు ఆమె కొరియోగ్రఫి అందిస్తోంది. ఆ పాటలో నసీరుద్దీన్ షా,విద్యాబాలన్ కి మధ్య వచ్చే ఇంటిమేట్ సీన్స్ ని చాలా హాట్ గా చిత్రీకరిస్తోంది. ఈ విషయమై ఆమె మట్లాడుతూ.. ఈ పాట కోసం ఓ ఇంటిమటే సీక్వెన్స్ ప్లాన్ చేసాం.అందుకోసం దాదాపు పదిహేను సినిమాలు రిఫెరెన్స్ లు తీసుకున్నాం. గతంలో సిల్క్ స్మిత నటించిన సినిమాలు చూసి ఆ ఎక్సప్రెషన్స్ ని ఎడాప్ట్ చేస్తూ పాటను రూపొందించాం అంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా హిందీలో ఈ 'డర్టీ పిక్చర్' రూపొందుతోంది. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో సిల్క్ స్మితగా నటిస్తోంది. ఇప్పుడీ చిత్రంలో రజనీని పోలిన పాత్రలో ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా కనిపిస్తారు. రకరకాల హెయిర్ స్టయిల్స్ తో, రజనీ అప్పట్లో ధరించినటువంటి చమ్కీ మెరుపుల దుస్తుల్లో నసీర్ కనిపిస్తాడు.


Click it and Unblock the Notifications











