ఎన్టీఆర్ శక్తి చిత్రంలో నా పాత్ర ఏమిటంటే...పూజా బేడీ

By Srikanya

ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న శక్తి చిత్రంలో బాలీవుడ్ నటి పూజా బేడీ ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకీ ఆ పాత్ర ఏమిటంటే..ఆమె ఈజిప్టు మహారాణిగా కనిపించనుంది. నెగిటివ్ టచ్ తో ఈ పాత్ర సాగుతుంది. మోహన్ బాబు చిత్రం చిట్టెమ్మ మొగడు తర్వాత ఆమె తెలుగులో చేస్తున్న చిత్రం ఇదే. ఇక ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ...

ఎన్టీఆర్ శక్తి చిత్రంలో నా పాత్ర షూటింగ్ పూర్తయింది. ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద బడ్జెట్ చిత్రం. ఇందులో నాకు సూపర్ నేచురల్ పవర్స్ ఉంటాయి. ఈజిప్టు యువరాణిగా నేను అలరిస్తాను అన్నారామె.అలాగే ఈ చిత్రంలో స్పెషల్ ఎఫెక్టులు,గ్రాఫిక్స్ అధ్బుతంగా ఉంటాయని అన్నారామె. ఇలియానా హీరోయిన్ గా చే్స్తున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.

తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అత్యధిక లొకేషన్లలో, అత్యధిక నిర్మాణ వ్యయంతో, అత్యాధునిక సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఓ ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుంది..అదే "శక్తి" స్పెషాలిటీ అని నిర్మాత ఆశ్వనీదత్ అంటున్నారు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీత బాణీలు అందుస్తున్నారు. జాకీష్రాప్, పూజాబేడి, సోనూ సూద్ వంటి బాలీవుడ్ తారలు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అలాగే ప్రభు, పవిత్రాలోకేష్, ప్రగతి, కృష్ణభగవాన్, అలీ, వేణుమాధవ్, నాజర్ తదితరులు ఇతర ప్రాతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, రచనా సహకారం: యండమూరి జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్, ఆర్ట్: ఆనంద్‌సాయి, కెమెరా: సమీర్ రెడ్డి, సమర్పణ: సి. ధర్మరాజు, స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: మెహర్ రమేష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X