ఆ పుస్తకం వల్లే... హాట్ లేడీ విడాకులు
ముంబై: ఒకప్పుడు కామసూత్ర కండోమ్స్ యాడ్‌లో నటించి సంచలనం సృష్టించిన బాలీవుడ్ హీరోయిన్ పూజా బేడీ మీకు గుర్తుందా...? తాజాగా ఈ ఆంటీ ఆ సక్తికర విషయం బయట పెట్టింది. కట్టుకున్న మొగుడికి విడాకుల ఇచ్చి బాయ్ ఫ్రెండ్స్‌తో డేటింగ్ చేస్తున్న పూజా బేడీ ఓ పుస్తకం చదవి భర్తతో విడాకుల నిర్ణయానికి వచ్చిందట.
'పుస్తకం చదవడం వల్ల మంచి అనుభూతి కలిగిందని కొందరు అంటారు. ఓ పుస్తకం చదివిన తర్వాతనే తన భర్తకు విడాకులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నానని, విడాకులు తీసుకోవడం జీవితంలో మంచి అనుభూతిని మిగిల్చిందని' చెప్పుకొచ్చింది.
ఆ పుస్తకం పేరేంటి అని అడ్డగా...డాక్టర్ స్పెన్సర్ జాన్సన్ రచించిన 'హూ మూవ్డ్ మై చీస్' అనే పుస్తకం చదివిన తర్వాతనే భర్త పర్హాన్ ఇబ్రహీం ఫర్నీచర్ వాలాకు విడాకులు ఇచ్చానని అంటోంది. తన సమస్యలకు కారణం తానే అని తెలుసుకున్నానని, పుస్తకం చదివిన తర్వాత జీవితం పూర్తిగా మారిపోయిందని తెలిపింది.
42 ఏళ్ల పూజా బేడీ ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ ఆకాష్ దీప్ సెహగల్‌తో డేటింగ్ చేస్తోంది. ఓ బుక్ స్టోర్లో ఈ ఇద్దరు మీడియా కంట పడటంతో తన విడాకుల విషయాన్ని ఇలా వివరించింది.


Click it and Unblock the Notifications












