For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లేటు వయసులో పూజా బేడీ రెండో వివాహం, ప్రియుడితో ముదిరిన ప్రేమ వ్యవహారం!

    |

    ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని తన సెక్సీ సొగసులతో ఉర్రూతలూగించిన పూజా బేడీ.. లేటు వయసులో రెండో వివాహానికి సిద్ధమయ్యారు. త్వరలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ మానిక్ కాంట్రాక్టర్‌ను పెళ్లాడబోతున్నారు. తాజాగా బాంబే టైమ్స్ ఇంటర్వ్యూలో పూజా బేడీ ఈ విషయాన్ని వెల్లడించారు.

    48 ఏళ్ల పూజా బేడీ 1994లో పర్హాన్ ఇబ్రహీం ఫర్నీచర్వాలాను పెళ్లాడి 2003లో విడిపోయారు. పూజా బేడీకి ఇద్దరు పిల్లలు. కూతురు అలియా కూడా హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 19 ఏళ్ల కుమారుడు ఒమర్ ఇబ్రహీం కాలేజీ విద్యను అభ్యసిస్తున్నాడు. పూజా బేడీ సీనియర్ బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ కూతరు అనే విషయం తెలిసిందే.

    ప్రేమికుల రోజున ప్రపోజ్ చేశాడు

    ప్రేమికుల రోజున ప్రపోజ్ చేశాడు

    కొంతకాలంగా పూజా బేడీ తన స్నేహితుడు మానిక్ కాంట్రాక్టర్ ప్రేమలో ఉన్నారు. ప్రేమికుల రోజున మాణిక్‌ ఆమెను హాట్ ఎయిర్ బెలూన్‌లో వంద అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి ప్రపోజ్ చేశాడుట. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్లో వెల్లడించారు.

    గతేడాది రీకనెక్ట్ అయ్యారు... 2019లోనే పెళ్లి

    గతేడాది రీకనెక్ట్ అయ్యారు... 2019లోనే పెళ్లి

    చదువుకునే రోజుల నుంచే పూజా బేడీ, మానిక్ స్కూల్ మేట్స్. బోర్డింగ్ స్కూల్‌లో మానిక్ ఆమెకంటే 3 సంవత్సరాలు సీనియర్. గతేడాది గోవాలో బిజినెస్ వెంచర్ గురించి వెళ్లినపుడు ఇద్దరూ మళ్లీ రీ కనెక్ట్ అయ్యారట.

    నా పిల్లలకు ఈ పెళ్లి ఓకే..

    నా పిల్లలకు ఈ పెళ్లి ఓకే..

    2003 ఫిబ్రవరి 14న నాకు విడాకులు అయ్యాయి. 2019 ఫిబ్రవరి 14న ఎంగేజ్మెంట్ అయింది. నా పిల్లలు కూడా మానిక్‌ మా కుటుంబంలోకి రావడానికి ఇష్టపడుతున్నారు. మానిక్ మా అందరితో చాలా సరదాగా ఉంటారు... అని పూజా బేడీ చెప్పుకొచ్చారు.

    వారికి డేట్స్ సెట్టయినపుడే మా పెళ్లి డేట్ ఫిక్స్

    వారికి డేట్స్ సెట్టయినపుడే మా పెళ్లి డేట్ ఫిక్స్

    నా కూతురు అలియా సినిమా షూటింగుల్లో బిజీగా గడుపుతోంది. ఆమె డేట్స్ అడ్జెస్ట్ అయ్యేలా, ఓమర్ కాలేజ్ హాలిడేస్ మ్యాచ్ అయ్యేలా ప్లాన్ చేసుకుని పెళ్లి తేదీ ఫిక్స్ చేసుకుంటామని, ఈ సంవత్సరమే మా పెళ్లి ఉంటుందని పూజా బేడీ తెలిపారు.

    మా రెండు కుటుంబాలు కలిసిపోయాయి

    మా రెండు కుటుంబాలు కలిసిపోయాయి

    మా పెళ్లి విషయంలో రెండు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. మా ఇద్దరి మధ్య లవ్ రిలేషన్ మొదలైన తర్వాత రెండు కుటుంబాలు కలిసిపోయాయి. మానిక్ కాంట్రాక్టర్ జోవియల్‌గా ఉండే పార్శీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అని పూజా బేడీ తెలిపారు.

    English summary
    Former actress Pooja Bedi, who recently got engaged to boyfriend Maneck Contractor, told Bombay Times that they plan to get married later this year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X