హాల్ లేడీపై.... సెక్సీ ఆంటీ క్రిమినల్ కేసు
బాలీవుడ్ సెక్సీ ఆంటీ పూజా బేడీ...మరో హాట్ లేడీ పూజా మిశ్రాపై గురువారం(నిన్న) క్రిమినల్ కేసు దాఖలు చేసింది. ఈ విషయమై పూజా బేడీ ట్విట్టర్లో స్పందిస్తూ....పూజా మిశ్రా తనపై చేసిన ఆరోపణలను నిరూపించ లేదు, క్షమాపణ కూడా చెప్పలేదు. అందుకే ఆమెపై కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.
బిగ్ బాస్ 5 లో పాల్గొన్న పూజా బేడీ, పూజా మిశ్రా ఆ మధ్య గొడవ పడ్డారు. పూజా మిశ్రా తనను నేషనల్ టెలివిజన్లో అప్పతిష్ట పాలు చేసిందని పూజా బేడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే విధంగా పూజా మిశ్రా కూడా బేడిని టార్గెట్ చేస్తూ.... తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌తో కలిసి హింసించిందని మండి పడింది.
తన జీవితంలో తొలిసారి కోర్టు మెట్లు ఎక్కుతున్నానని, న్యాయ వ్యవస్థ ద్వారా తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. తనపై అసత్య ఆరోపణలు చేసిన పూజా మిశ్రాకు తగిన శిక్ష పడాలి అని పూజా బేడీ పేర్కొన్నారు. మరి ఈ కేసుపై పూజా మిశ్రా ఎలా స్పందిస్తుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
పూజా బేడి, పూజా మిశ్రా గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి....చివరకు కోర్టు కేసుల వరకు వెళ్లడం ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయంశం అయింది. మరి ఈ న్యాయ పోరాటంలో గెలుపు ఎవరిది అనేది త్వరలోనే తేలనుంది.


Click it and Unblock the Notifications











