కామసూత్రలో ఖ్యాతీ గడించిన సుందరీమణితో జూ ఎన్టీఆర్
ఒకప్పడు కామసూత్ర కండోమ్ యాడ్ లో హాట్ హాట్ గా అందాలు ఆరబోసి..సంచలనం సృష్టించిన మోడల్ పూజాబేడీ. బాలీవుడ్ లో అడపాదడపా సినిమాల్లో పూజా బేడీ కనిపిస్తున్నప్పటికీ తెలుగులో మాత్రం అప్పుడెప్పుడో మోహన్ బాబు నటించిన 'చిట్టెమ్మ మొగుడు" లో కనిపించి ఆ తర్వాత మళ్లీ ఇటు మొహం చూపలేదు.
చాన్నాళ్ల తర్వాత ఈ కామసూత్ర సుందరి..తెలుగు తెరపై దర్శనమివ్వబోతోంది. జూ ఎన్టీఆర్ బృందానవం తర్వాతి సినిమా 'శక్తి" లో ఈ కామసుందరికి చోటు దక్కింది. 40ఏళ్లు దాటిన ఈ ప్రౌడ సుందరి ఏం ఆరబోస్తుందిలే అనుకుంటే పొరపాటే. సినిమా దర్శక నిర్మాతలు ఒక భారీ ప్లాన్ తోనే కామసుందరిని 'శక్తి"లో ఎంటర్ చేశారు. అశ్వనీదత్ నిర్మాణంలో బడ్జెట్ లిమిట్ లేకుండా రూపొందుతోన్న శక్తి సినిమా హిందీలో కూడా డబ్ అవుతోందని అక్కడి మార్కెట్ దృష్టిలో పెట్టుకుని పూజా బేడీతో పాటు జాకీష్రాఫ్, సోనూసూద్ లాంటి బాలీవుడ్ నటుల్ని ఇందులో నటింపచేస్తున్నారని టాలీవుడ్ టాక్.


Click it and Unblock the Notifications











