ఆ నగ్న చిత్రం ఆమెదే అని ఖరారు
ఆమెను కలుసుకోవడానికి షోలోకి వెళ్లిన మహేశ్ భట్ జిస్మ్ 2లో పాత్ర కోసం అక్కడే ఆమెను అడిగారు. 'ఇది అధికారికం కాదు. అయితే జిస్మ్ 2లో సన్నీ నటిస్తోందని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడిక సస్పెన్స్ వీడినట్టే!' అని పూజా ట్విటర్‌లో రాసింది. తెల్లటి బట్టల చాటున ఉన్న అందగత్తె జాడ కోసం చాలా మంది గూగుల్‌లో గాలించారు. ఆమె ఎవరో గురువారం రాత్రి 12 గంటలకు తెలియజేస్తామని మహేశ్ ఇటీవల ప్రకటించారు. 2003లో విడుదలైన జిస్మ్‌కు కొనసాగింపుగా తీస్తున్న జిస్మ్ 2 ప్రాజెక్టుపై ఆమె సంతకం చేసిన సంగతిని కూడా బయటపెట్టారు.
ఇక కెనడాలోని పంజాబీ కుటుంబంలో పుట్టి పెరిగిన సన్నీ లియోన్ అసలు పేరు కరణ్ మల్హోత్రా. జిస్మ్ 2లో చాన్స్ రావడం చాలా ఆనందంగా ఉందని ట్విటర్‌లో రాసింది. 'జిస్మ్ 2లో పనిచేస్తుండడం అద్భుతంగా అనిపిస్తోంది. ట్విటర్‌లో ఈ పేజీని ఫాలో అవుతుండండి. ఈ సినిమా తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి' అని సందేశం పోస్ట్ చేసింది. జిస్మ్2లో సన్నీ ప్రధాన నాయిక కాగా, ఇద్దరు హీరోలు ఉంటారు. అయితే వీరిని ఇంకా ఎంపిక చేయలేదు. ఇది చాలా కష్టమైన పనేనని పూజాభట్ అంటోంది.


Click it and Unblock the Notifications












