హాట్ సినిమాల భామ...భర్తతో విడిపోయింది!
హైదరాబాద్: మెడల్‌గా, హీరోయిన్, దర్శకురాలిగా...ఇలా ప్రతి విభాగంలోనూ హాట్ ఇమేజ్ సొంతం చేసుకున్న భామ పూజా భట్. 42 ఏళ్ల పూజా భట్ ఒకప్పుడు హాట్ అండ్ సెక్సీగా మోడలింగ్ రంగంలో అదరగొట్టింది. తర్వాత హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసి అందాల ఆరబోత విషయంలోనూ తనదైన ముద్ర వేసింది.

నిర్మాత, దర్శకురాలిగా...పలు శృంగార ప్రధానమైన చిత్రాలు తెరకెక్కించింది. బాలీవుడ్ సంచలన ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కూతురైన పూజా భట్ తాజాగా ఓ ముఖ్యమైన విషయం తన ట్విట్టర్ ద్వారా బయట పెట్టింది. భర్త మనీష్ మఖిజా అలియాస్ మున్నా(ఛానల్ వి మాజీ విజె) నుండి విడిపోయినట్లు ఆమె తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
11 ఏళ్ల వైవాహిక జీవితానికి తాము పులిస్టాప్ పెట్టబోతున్నట్లు ఆమె తెలిపింది. ఇద్దరి మధ్య విడాకుల తంతు ఎలాంటి వివాదం లేకుండా సాఫీగా సాగి పోయింది. తాము సినిమా రంగం ద్వారా ప్రజా జీవితంలో ఉన్నాము కాబట్టే ఈ విషయం అందరికీ తెలియ జేస్తున్నట్లు తెలిపారు. అయితే తాము ఎందుకు విడిపోయామనే కారణం మాత్రం ఆమె బయట పెట్టలేదు.


Click it and Unblock the Notifications











