తాగుడుకు బానిసైన నటి: ఎలా బయట పడిందో పుస్తకం ద్వారా...

బాలీవుడ్ నటి, ఫిల్మ్ మేకర్ పూజా భట్ కొన్ని రోజుల క్రితం విపరీతంగా తాగుడుకు బానిసైంది.

By Bojja Kumar

పూజా భట్... ఒప్పుడు తన గ్లామర్ తో బాలీవుడ్‌ను షేక్ చేసిన నటి. ప్రముఖ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కూతురైన పూజా భట్ అప్పట్లో బాలీవుడ్లో ఓ సంచలనం. తర్వాత నటిగా, దర్శకురాలిగా ఆమె పలు చిత్రాలు చేశారు.

Recommended Video

హీరోయిన్ సెమీ న్యూడ్ మసాజ్ వీడియో.. ఇంటర్నెట్లో వైరల్..

ఈ క్రమంలో పూజా భట్ విపరీతంగా తాగుడుకు బానిసైంది. అయితే ఆ వ్యవసనం నుండి ఆమె బయట పడటానికి చాలా సమయం పట్టింది. తాను తాగుడు అలవాటును నుండి ఎలా బయట పడ్డానో వివరిస్తూ ఆమె తాజాగా ఓ పుస్తకం రాస్తోంది. ఈ పుస్తకం తనలాగా తాగుడుకు బానిసైన వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఇది తన ఆటో బయోగ్రఫీ మాత్రం కాదని ఆమె తెలిపారు.

ఈ పుస్తకం రాయడంలో తనకు రోష్మిలా భట్టాచార్య సహాయం చేస్తోందని, పెంగ్విన్ రాండమ్ హైస్ ఇండియా వారు ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేస్తున్నారని, వచ్చే ఏడాది ఈ పుస్తకం విడుదల చేయబోతున్నట్లు పూజా తెలిపారు.

10 నెలలుగా మందు ముట్టడం లేదు

10 నెలలుగా మందు ముట్టడం లేదు

కేవలం 45 ఏళ్ల వయసులోనే నా మెమొరీస్ పుస్తక రూపంలో తేవడం ఆనందంగా ఉందని, ఈ పుస్తకం తనలాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వారికి ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. గత 10 నెలలుగా తాను లిక్కర్ ముట్టడం లేదని పూజా భట్ తెలిపారు.

మానేయడం అసాధ్యం అయితే కాదు

మానేయడం అసాధ్యం అయితే కాదు

మందు మానేయడం అనేది అంత సులభం కాదు, కానీ అసాధ్యం మాత్రం కాదు అని పూజా భట్ తెలిపారు. ఈ పుస్తకంలో సిరీస్ వైజ్‌గా చాప్టర్లు ఉంటాయని, ఇది ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇండియా లాంటి దేశంలో

ఇండియా లాంటి దేశంలో

పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఎడిటర్ స్వాతి చోప్రా మాట్లాడుతూ... ఇలాంటి బుక్ రాయడానికి ఎంతో ధైర్యం ఉండాలి. ఇండియాలో లాంటి దేశంలో, అందులోనూ ఒక మహిళ ఇలాంటి టాపిక్ మీద పుస్తకం రాయడం మామూలు విషయం కాదు అన్నారు.

గర్వంగా ఉంది

గర్వంగా ఉంది

పూజా ఎంతో దైర్యంగా తన ఆల్కహాలిజం మీద ఎంతో నిజాయితీగా ఈ పుస్తకం రాస్తోంది. ఇలాంటివి చాలా రేర్ గా చోటు చేసుకుంటాయి. బాలీవుడ్ లాంటి ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీ ఇలాంటి పుస్తకం రాయడం చాలా అరుదు. దీన్ని తాము పబ్లిష్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది అని స్వాతి చోప్రా వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X