బాలకృష్ణ 'భీష్మ' పూజ
బాలకృష్ణ కొత్త చిత్రం భీష్మ పూజా కార్యక్రమాలు ఈరోజు(గురువారం)బెల్లంకొండ సురేష్ ఆఫీసులో జరిగాయి. మంచిరోజులు అయిపోనుండటంతో ఫార్మల్ గా ఈ చిత్రం పూజ చేసామంటున్నారు. ఈ విషయమై బెల్లంకొండ మాట్లాడుతూ జూన్ ఇరవై తొమ్మిదిన గ్రాండ్ గా ఈ ఓపినింగ్ పంక్షన్ ని జరుపుతామని..రమేష్ వర్మ డైరక్ట్ చేస్తున్నారని చెప్పారు. అలాగే ఈ స్టార్ కాస్టింగ్ పూర్తియిందని అయితే చిత్రం ఓపినింగ్ రోజే హరోయిన్స్ ని ఎవరనేది ప్రకటిస్తామన్నారు. రిలీజ్ డేట్ కూడా ఓపినింగ్ రోజే ప్రకటించి దాని ప్రకారం ప్లాన్ చేస్తామన్నారు. ఇక బాలయ్యతో పనిచేయటం తనకు ఆనందాన్నిస్తోందన్నారు. గతంలో చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహా నిర్మించిన తనకు బాలయ్యతో మూడవ చిత్రమని దీన్ని విజయవంతం చేస్తామన్నారు. ఇక రైడ్ కు ముందే ఈ చిత్రం కథ రమేష్ వర్మ చెప్పాడని,అది విని తాను చాలా ఇంప్రెస్ అయ్యాయని చెప్పుకొచ్చారు. ఇది పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ తో నడిచే చిత్రమన్నారు. ఎన్టీఆర్ భీష్మకి తమకీ టైటిల్ తో తప్ప పోలిక లేదన్నారు. ఇది పౌరాణికం కాదని స్పష్టం చేసారు. ఇక ఈ చిత్రానికి ముగ్గురు హీరోయిన్స్ ఉండే అవకాశం ఉందని సమాచారం.


Click it and Unblock the Notifications











