అనుమాన పక్షితో కాపురమెలా? అంటూ హీరోయిన్ కన్నీళ్లు
బెంగళూరు : ఎవరు ఫోన్ చేసినా అనుమానంతో చూసేవాడు. అలాంటి వ్యక్తితో నూరేళ్ల జీవితం ఎలా గడిపేది అంటూ ప్రశ్నించింది పూజా గాంధీ. ఆమె పెళ్లి పీటలెక్కక ముందే.. పెటాకులైంది . తన నిశ్చితార్థం రద్దు కావడంపై నటి పూజాగాంధీ కన్నీళ్లు పెట్టుకున్నారు. జీవితంలో ఇదో అనుభవమని అన్నారు. సినిమా రంగమంటే ఆనంద్‌గౌడకు ఇష్టంలేదు. వివాహానంతరం సినిమాల్లో చేయవద్దని అనేవాడు. కలిసి వ్యాపారం చేయాలని అనుకున్నాం. అయితే ఇప్పుడు దాన్ని రద్దు చేసుకుంటున్నానని చెప్పింది.
'ఇతర ఆడపిల్లల్లా నిశ్చితార్థం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అయితే నెల రోజుల్లోపే సందేహాలు..... అభిప్రాయబేధాలు.... ఎంతో బాధను కల్గించాయి. అమ్మానాన్నలను కష్టపెట్టడడం ఇష్టంలేదు. అందుకే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకునేందుకే నిర్ణయించాను' అని చెప్పారు. పూజా గాంధీ బుధవారం బెంగళూరు లో ఒక టీవీఛానెల్‌తో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
కన్నడ నటి పూజా గాంధీ వివాహం రద్దయింది. ఫైనాన్షియర్, బాలీవుడ్ చిత్ర నిర్మాత ఆనంద గౌడతో గత నెల 15న ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఇటీవల ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం పూజా గాంధీ ఇంటికి ఆనంద గౌడ వెళ్లినప్పుడు పూజా తల్లితో వాగ్వాదం జరిగింది. తదనంతరం వివాహాన్ని రద్దు చేసుకోవాలని పూజా గాంధీ నిర్ణయించింది. దీనిని ఆనంద గౌడ కూడా ధ్రువీకరించారు.
అలాగే ఆనంద్‌గౌడను తన తల్లి చులకనగా మాట్లాడినట్లు వస్తున్న ఆరోపణల్ని పూజా గాంధీ తోసిపుచ్చారు. 'మా అమ్మను తూలనాడిన వ్యక్తిని వివాహం చేసుకునే ప్రసక్తేలేదు. నిశ్చితార్థం రోజున ఆనంద్‌గౌడ తొడిగిన ఉంగరాన్ని బుధవారం ఉదయం వెనక్కు పంపాను. నిశ్చితార్థం రద్దు కావడానికి ఆనంద్‌గౌడే కారణం. ఎవరు ఫోన్ చేసినా అనుమానంతో చూసేవాడు. అలాంటి వ్యక్తితో నూరేళ్ల జీవితం ఎలా గడిపేది. అందుకే వద్దనుకున్నాను అని తేల్చి చెప్పారు.
పూజా గాంధీ తల్లి తనను దూషించిందని ఆనంద గౌడ ఆరోపించారు. పూజా గాంధీ మంచిదేనని, తల్లి చాటు బిడ్డగా వ్యవహరిస్తున్నందున ఆమె స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేక పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు మంచి జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.
కన్నడ టీవీ ఛానల్స్ లో వస్తున్న వార్తల ప్రకారం..... పూజా గాంధీ మదర్ చేసిన కాంమెట్లను బట్టి ప్రస్తుతం వీరిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. పూజా గాంధీ మదర్ ఆనంద గౌడ అధికబరువుపై కామెంట్స్ చేసిందట. అతన్ని కోకాకోలా బాటిల్ అంటూ కామెంట్ చేసిందట. అంతటితో ఆగకుండా ఆనంద గౌడ ఫ్యామిలీ ముందు కూడా అతన్ని అవమాన పరిచినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












