»   » తన కెరీర్ ని అడ్డుకుంటున్నారంటూ కన్నీరు

తన కెరీర్ ని అడ్డుకుంటున్నారంటూ కన్నీరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : ఎంతో శ్రమించి చిత్రాన్ని నిర్మిస్తే ఇటువంటి పరిస్థితి ఎదురైందంటూ పూజా కన్నీరు పెట్టింది. అభినేత్రి నవలకు కానీ, నటి కల్పన జీవితంతో కానీ తన చిత్రానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టీకరించారు. తన ఎదుగుదలను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని పూజాగాంధి ఆరోపించారు. అభినేత్రి సినిమా విడుదలపై ఉన్న స్టే తొలగించాలని కోరుతూ నటి, నిర్మాత పూజాగాంధి హైకోర్టులో వేసుకున్న అర్జీ విచారణ 23వ తేదీకి వాయిదా పడింది.

సివిల్‌ కోర్టు విధించిన స్టేను తొలగించేందుకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని కోర్టుకు సమర్పించాలని రచయిత్రి భాగ్య కృష్ణమూర్తికి హైకోర్టు సూచించింది. తన అభినేత్రి నవలను కాపీ కొట్టి పూజాగాంధి అభినేత్రి చిత్రాన్ని నిర్మించారని భాగ్య కృష్ణమూర్తి వేసుకున్న అర్జీపై విచారణ పూర్తి చేసిన సివిల్‌ కోర్టు ఆ చిత్రం విడుదలపై స్టే విధించి, చిత్రం రీళ్లు, స్క్రిఫ్ట్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. సివిల్‌ కోర్టు ఆదేశాల్ని ప్రశ్నిస్తూ పూజా హైకోర్టును ఆశ్రయించింది.

దివంగత నటి కల్పన జీవిత చరిత్రనే అభినేత్రి చిత్రంగా తెరకెక్కించారంటూ భాగ్య కృష్ణమూర్తి, పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరు కోర్టులో అర్జీ వేసుకున్నారు. తాను రచించిన అభినేత్రి నవలనే కాపీ కొట్టి ఈ చిత్రం నిర్మించారనేది భాగ్య కృష్ణమూర్తి ప్రధాన ఆరోపణ.

 Pooja Gandhi cries in court hall for stay on her film Abhinetri

తాను నిర్మాతగా ఉంటూ నాయికగా నటిస్తున్న అభినేత్రి చిత్రానికి, దివంగత నటి కల్పన జీవితానికి ఎటువంటి సంబంధం లేదని నటి పూజాగాంధీ కోర్టులో వివరణ ఇచ్చారు. కల్పన జీవితాన్ని పూజా చిత్రంగా తీస్తున్నారని, ఈ చిత్రం విడుదల కాకుండా ఆదేశించాలంటూ కల్పన బంధువులు కొందరు ఒకటవ ఏసీఎంఎం కోర్టులో దావా వేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఏసీఎంఎం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పూజా కోర్టుకు హాజరయ్యారు. కల్పన జీవితాన్ని తాను చిత్రంగా తీయటం లేదని న్యాయమూర్తి ముందు ఆమె వివరణ ఇచ్చారు.

వెండితెరపై ఒక్కవెలుగు వెలిగి పరిస్థితుల ప్రభావంతో దుర్భర జీవితం సాగించిన హీరోయిన్స్ జీవితాల కథాంశంతో 'అభినేత్రి' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా ప్రముఖ నటి పూజాగాంధీ నిర్మాతగా మారడంతో పాటు ప్రధాన పాత్రను కూడా పోషిస్తోంది. కట్టుబొట్టు అలనాటి నటి కల్పనను పోలిఉన్నా ఆమె జీవితానికి అభినేత్రి సినిమాకు సంబంధం లేదని పూజా స్పష్టం చేశారు.

ఏడో దశకం నాటి పరిస్థితుల నేపథ్యంలో కథాగమనం ఉంటుంది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చిత్రీకరణను కొనసాగించేందుకు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొనాల్సి వచ్చిందని తెలిపారు. రంగస్థలం నేపథ్యం కోసం ఉత్తర కర్ణాటక ప్రాంతంలో చిత్రీకరణను పూర్తి చేశారు. అభినేత్రిలో అభినయం సవాల్‌గా తీసుకుని పూర్తిచేసినట్లు వెల్లడించారు. ఆడియోకు మంచి ఆదరణ లభిస్తోంది.

English summary
Pooja Gandhi's home production, Abhinetri, which is based on yesteryears' stars, has been embroiled in yet another controversy. Author Bhagya Krishnamurthy approached a Bangalore court recently, claiming that the movie is based on her 2003 book Abhinetriya Antaranga.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu