హాట్ లేడీ ఎంగేజ్ మెంట్-అభిమానులకు బ్యాడ్ న్యూస్!
బెంగుళూరు : వెండి తెరపై తమ హాట్ హాట్ అంద చందాలు, లవ్లీ పెర్ఫార్మెన్స్‌తో అభిమానులను ఎంటర్ చేసిన తారలు పెళ్లి తర్వాత వెండి తెరకు దూరం అవ్వడం సర్వ సాధారణమే. ఇలాంటి పరిస్థితులు వాళ్ల అభిమానులకు ఒకరకంగా బ్యాడ్ న్యూసే. ఎందుకంటే వాళ్లను ఇకపై సినిమాల్లో చూసే అవకాశం దాదాపుగా ఉండదు కాబట్టి.

‘దండు పాల్య' అనే కన్నడ చిత్రానికి గాను పూజా గాంధీ నగ్నంగా నటించడానికి సిద్ధం అయింది. ఈ సినిమాతో ఆమె పేరు పాపులర్ అయింది. అదే విధంగా రాజకీయ తెరంగ్రేటం చేసి మరోసారి చర్చనీయాంశం అయ్యారు. కర్నాటకలో ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్న జెడి(ఎస్)లో ఆమె ఈ సంవత్సరం జనవరిలో చేరారు.

పూజా గాంధీ త్వరలో రాబోతున్న గురుప్రసాద్ మూవీ ‘డైరెక్టర్స్ స్పెషల్' ఐటంగా సాంగు చేసింది.

పూజా గాంధీ ఇప్పటి వరకు వివిధ భాషల్లో 40 సినిమాల వరకు నటించింది. ఆమె తన నటన బెంగాళీ చిత్రం ‘టొమాకె సలాం'తో మొదలు పెట్టింది. ఆ తర్వాత కన్నడ, తమిళం, మళయాలం భాషల్లో అవకాశాలు దక్కించుకుంది.

ఆమె కెరీర్లో తొలి బిగ్గెస్ట్ బ్రేక్ యోగరాజ్ భట్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం ‘ముంగారు మాలె' చిత్రంతో లభించింది.

ఆర్ చంద్రు దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం ‘తాజ్ మహల్', ఉపేంద్ర హీరోగా రూపొందిన ‘బుదివంత', ‘దండుపాల్య' చిత్రాలు ఆమె కెరీర్లో హిట్ చిత్రాలుగా నిలిచాయి.
తాజాగా ఆ లిస్టులో కన్నడ హాట్ హీరోయిన్ పూజా గాంధీ కూడా చేరి పోయింది. అమ్మడు త్వరలో ఓ ఇంటిది కాబోతోంది. రేపు(నవంబర్ 15) తన బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్ మెంట్ జరుపుకోబోతోంది.ఎన్‌ఆర్‌ఐ రామా నందగౌడతో పూజాగాంధీ ఎంగేజ్ మెంట్ గురువారం జరుగనుంది.
బెంగులూరులోని పూజాగాంధీ రెసిడెన్సీ ఇందుకు వేదికకానుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగా జరుగబోతోందని, ఈ వేడుకకు ఇరు కుటుంబాకుల చెందిన వారు, సన్నిహితులు మాత్రమే హాజరువుతున్నట్లు సమాచారం. తర్వాత ఇద్దరు తమ క్లోజ్ ఫ్రెండ్స్ కి గ్రాండ్ గా పార్టీ ఇవ్వనున్నారట.


Click it and Unblock the Notifications











