భూమిక హీరోయిన్ గా రవిబాబు రూపొందించిన అనసూయ చిత్రం ఇప్పుడు కన్నడంలో రూపొందుతోంది. అయితే అక్కడ భూమిక వేసిన పాత్రను హాట్ గర్ల్ గా పేరొందిన పూజా గాంధీ చేస్తోంది. అనసూయ చిత్రానికి రవిబాబు దగ్గర అశోసియేట్ గా పనిచేసిన దర్శకుడు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. శుక్రవారం ఈ చిత్రానికి సంభందించి ముహూర్తం భానుశంకరీ మెడికల్ కాలేజీలో జరిపారు. కంటిన్యూ 35 రోజుల షెడ్యూలు తో ఈ చిత్రాన్ని పూర్తి చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. నాగ్ కిరణ్ ఇక్కడ రవిబాబు వేసిన పాత్రను వేస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి అను అనే పేరును టైటిల్ గా పెట్టనున్నారు. దునియా చిత్రంలో చేసిన రేష్మి అనసూయలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే నిఖిత చేసిన పాత్రను చేయనుంది. నిరంజన్ బాబు కెమెరా వర్క్ చేస్తున్నాడు. అక్కడ కూడా ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందని దర్శక,నిర్మాతలు ఆశగా ఉన్నారు.