వీరప్పన్ భార్యగా నటించబోతున్న హాట్ హీరోయిన్

By Bojja Kumar

హైదరాబాద్: కన్నడ హాట్ హీరోయిన్ పూజా గాంధీ త్వరలో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల కర్నాటకలో ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా గాంధీ తాజాగా మళ్లీ సినిమాల్లో నటించడానికి సైన్ చేసారు. త్వరలో ఆమె వివాదాస్పద పాత్ర పోషించబోతున్నారు.

ఈ చిత్రంలో ఆమె గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ముత్తులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కే ఈ చిత్రం ద్వారా జగ్గి అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేయడంతో పాటు నిర్మాతగా కూడా కొనసాగనున్నారట పూజా గాంధీ.

Pooja Gandhi To Play Veerappan's Wife Muthulakshmi

కన్నడ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం దండుపాళ్యం సినిమాలో పూజా గాంధీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత దర్శకుడు జగ్గి ఆమెతో వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి పాత్ర చేయించాలని ప్లాన్ చేసాడని, ఈచిత్రంలో వరుస హత్యలు చేసే లక్ష్మి పాత్రలో ఆమె కనిపించబోతోందని తెలుస్తోంది.

ఈ పాత్రకు ఆమె తప్ప మరెవరూ సూట్ కారని, ఆమె అయితేనే చాలెజింగ్‌గా తీసుకుని ఈ రోల్ చేయగలదని దర్శకుడు జగ్గి భావిస్తున్నాడట. ఈ మేరకు పూజా గాంధీని ఒప్పించారని అంటున్నారు. దండుపాళ్యం చిత్రంలో ఇరగదీసిన పూజా గాంధీ ముత్తులక్ష్మి పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X