twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పొలిటీషియన్స్ తో ఆడుకుంటున్న అర్ధనగ్న హీరోయిన్...

    By Srikanya
    |

    బెంగళూరు: సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా కన్నడ హీరోయిన్ పూజాగాంధీ తన విలక్షణ తత్వాన్ని చాటుతోంది. ఏడాది తిరక్కమునుపే రెండు పార్టీలు మార్చి రికార్జు క్రియేట్ చేసింది. ఇప్పుడు మూడో పార్టీలో చేరేందుకు సన్నాహాల్లో ఉంది. ముంగారుమళె (తెలుగు వాన) సినిమాతో ఒక్కసారిగా కన్నడ సీమలో ప్రవేశించడమే కాదు సంచలనం సృష్టించింది.

    ముంగారుమళె సినిమా ఘనవిజయం సాధించడంతో ఒకదాని వెంట ఒకటిగా ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆరేళ్ల కాలంలో ఏకంగా పాతికకు పైగా సినిమాల్లో నటించింది. ఒకవైపు నటనను కొనసాగిస్తూనే సామాజిక సేవల పట్ల ఆసక్తిని వ్యక్తం చేస్తూ వస్తోంది. హెచ్‌ఐవి, క్యాన్సర్‌ పీడితులకు అండగా నిలిచింది. వారికి సంబంధించిన అనేక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. అదే సమయంలోనే రాజకీయాల పట్ల ఆసక్తిని పెంచుకుంది. గత ఏడాది జనవరిలో జనతాదళ్‌ (ఎస్‌) పార్టీలో చేరింది.

    మణ్ణినమగ దేవెగౌడ నాయకత్వం పట్ల అపారమైన విశ్వాసాన్ని ప్రకటించిన..పూజా కుమారస్వామి నాయకత్వంలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కుండబద్ధలు కొట్టింది. ఆ పార్టీకి సంబంధించి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రధాన ఆకర్షణగా మారింది. అయితే నరహంతకుల ముఠా దండుపాళ్య (దండుపాళ్యం పేరుతో తెలుగులో విడుదలైంది.) కథాంశంతో అదే పేరుతో రూపొందిన సినిమాలో అర్ధనగ్నంగా నటించడం అనేక విమర్శలకు తావిచ్చింది. దీంతో కుమారస్వామి తమకు ఆమె సేవలు అవసరం లేదని బహిరంగంగా ప్రకటించడంతో గత ఏడాది అక్టోబరులో జెడీఎస్‌కు దూరమైంది.

    రెండు నెలల పాటు సినిమాలకే పరిమితమైన పూజాగాంధీ తిరిగి డిసెంబరు తొమ్మిదిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నెలకొల్పిన కర్ణాటక జనతాపార్టీలో చేరి మరోసారి సంచలనం సృష్టించింది. ఆ మధ్య కాలంలోనే ఆనంద్‌ అనే వాణిజ్యవేత్తతో కుదిరిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని వార్తల్లోకెక్కింది. కర్ణాటక జనతాపార్టీలో తగినంత గుర్తింపు లభించని కారణంగా ఇప్పుడు బి.శ్రీరాములు నేతృత్వంలోని బిఎస్‌ఆర్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతోంది. మరో రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పింది. ముచ్చటగా మూడో పార్టీలో చేరనున్న పూజాగాంధీ ఆ పార్టీలో ఎంతకాలం కొనసాగుతుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

    English summary
    Pooja Gandhi who has acted in more than 40 Kannada films and is best known for the hit movie 'Mungaru Male', is all set to hop into another party, the third in less than a span of one year. Pooja Gandhi forayed into Karnataka politics by joining JD(S) last year. But she left JD(S) surprisingly and announced her entry into B S Yeddyurappa's KJP few weeks ago. Now her third innings in politics is set to start, without having made any contribution to or achieved anything in Karnataka politics. If reports are to be believed, Pooja Gandhi had talks with BSR Congress founder Sriramulu and is certain to join his party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X