హీరోయిన్ బెదిరింపులు-కోర్టుకెక్కిన బాధితుడు(ఫోటో ఫీచర్)
బెంగుళూరు: కన్నడ హాట్ హీరోయిన్ పూజాగాంధీ ఎంగేజ్‌మెంట్ ఆనందగౌడ అనే రియల్టర్‌తో జరుగడం... ఇద్దరి మధ్య విబేధాలు రావడం, ఎంగేజ్‌మెంట్ రద్దవడం తెలిసిందే. పూజాగాంధీ ఫ్యామిలీ నన్ను అవమానించిందని ఆనంద గౌడ ఆరోపిస్తే... నన్ను అనుమానిస్తున్నాడు అందుకే అతనితో తెగదెంపులు చేసుకున్నానని పూజాగాంధీ చెప్పుకొంది.
ఈ వివాదం మరువక ముందే... పూజాగాంధీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమెపై డాక్టర్ కిరణ్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేసాడు. పూజా గాంధీపై, ఆమె తండ్రి పవన్ గాంధీపై కంప్లైంట్ చేసాడు. నన్ను చంపుతానని బెదిస్తున్నారంటూ డాక్టర్ కిరణ్ తన పిటీషన్లో పేర్కొన్నాడు. (పూజా గాంధీ తన కారు, మొబైల్ వాడిందని గతంలో ఓ సారి కాంట్రవర్సీ సృష్టించింది ఈ కిరణే)
పూజాగాంధీ మ్యారేజ్ ఆనంద గౌడతో బ్రేకప్ అయిన తర్వాత ఆమె తండ్రి తనకు 10 నుంచి 20 సార్లు కాల్ చేసి.... చంపుతానని బెదిరించాడని ఆరోపించాడు. వారి బ్రేకప్ వెనక తానే ఉన్నట్లు పూజాగాంధీ కుటుంబం అపోహ పడుతుందని, అందుకే తనను చంపుతానని బెదిరిస్తున్నారని, "I will kill you" అంటూ ఎస్ఎంఎస్ కూడా పంపారని.... డాక్టర్ కిరణ్ ఆరోపించారు.
కిరణ్ న్యాయవాది ఆర్ఎల్ఎన్ చెప్పిన వివరాల ప్రకారం... పవన్ గాంధీ కిరణ్‌కు కాల్ చేసిన తర్వాతే బ్రేకప్ వార్త మీడియాలో వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే పూజాగాంధీ ఫ్యామిలీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. ఆనంద గౌడ, కిరణ్ కలిసి పూజాగాంధీకి అపకీర్తి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

కిరణ్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని, అతని ఆరోపణల్లో నిజం లేదని పూజాగాంధీ అంటోంది. అతను పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నాడని, నన్ను బెదింపులకు గురి చేసాడని పూజాగాంధీ ఆరోపిస్తోంది.

ఈ కొత్త కాంట్రవర్సీలోకి తనను లాగడంపై ఆనందగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పూజాగాంధీ, కిరణ్ గొడవకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు.

పూజా గాంధీ మదర్ జ్యోతి మాట్లాడుతూ... బ్రేకప్ వెనక కిరణ్ హస్తం ఉందని ఆరోపించారు. కిరణ్-ఆనంద గౌడ కలిసి తమను ఇబ్బందుల పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

గతంలో పూజా గాంధీ మాట్లాడుతూ...‘అతను నన్ను బెదిరింపులకు గురి చేస్తున్నాడు. అతని ఆరోపణలు నిరాధారమైనవి. నాకు అపఖ్యాతి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను అతని కారు వాడినట్లు చేసిన ఆరోపణలు నిజం కాదు. ఆ కారు మా ఫాదర్ పేరు మీద ఉంది. నాదగ్గర అన్ని డాకుమెంట్స్ ఉన్నాయి' అని చెప్పుకొచ్చింది.

ఎంటేజ్ మెంట్ జరిగిన ఐదు వారాల తర్వాత తన బాయ్ ఫ్రెండ్ ఆనంద గౌడతో పూజా గాంధీ తెగదెంపులు చేసుకుంది. డిసెంబర్ 19న వీరి సంబంధం బ్రేకప్ అయింది.


Click it and Unblock the Notifications











