Don't Miss!
- News ఏడాది పొడవునా శశ రాజయోగం.. ఈ రాశులకు డబ్బే డబ్బు
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
చార్టెడ్ ఫ్లైట్స్‌లో ఇంకా ఎన్నో.. బన్నీపై పూజా హెగ్డే కామెంట్స్
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాస్తా ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. ఆర్య సినిమాతో సుకుమార్ తనను స్టైలీష్ స్టార్ చేసేశాడని ఇప్పుడు మళ్లీ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా మార్చేశాడని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. బన్నీ బర్త్ డే సందర్బంగా ఐకాన్ స్టార్ అంటూ అభిమానులు ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. సెలెబ్రిటీలు బన్నీకి స్పెషల్ విషెస్ అందించారు. తాజాగా పూజా హెగ్డే చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
పూజా హెగ్డే బన్నీ కలిసి చేసిన చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. డీజే, అల వైకుంఠపురములో సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. అలా ఈ కాంబినేషన్‌పై ఆడియెన్స్ మంచి అంచనాలు పెట్టుకుంటున్నారు. అయితే తాజాగా బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పిన పూజా హెగ్డే నాటి విషయాలను గుర్తు చేసుకుంది. గత ఏడాది అల వైకుంఠపురములో సినిమాతో హిట్ కొట్టిన విషయాలు, ఎంజాయ్ చేసిన క్షణాలను తలుచుకుంటూ విషెస్ చెప్పింది.
ఎంతో స్టైలీష్ అయిన అల్లు అర్జున్‌కు హ్యాపీ బర్త్ డే. మనం చార్టెడ్ ఫ్లైట్‌లో ఇంకా ఎన్నో పార్టీలు చేసుకోవాలి.. ఇంకా మరెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించాలి.. నువ్ కోరుకున్న ప్రతీదీ నీకు దక్కాలను ఆశిస్తున్నాను.. కేక్‌లు బాగా తిను అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. పూజాహెగ్డే పోస్ట్‌పై బన్నీ స్పందిస్తూ.. థ్యాంక్యూ సో మచ్ స్వీట్ నెస్ అంటూ పోస్ట్ చేశాడు. మొత్తానికి ఈ ఇద్దరి మాటలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.