జిగేల్ రాణి సీక్రెట్స్ బయటపెట్టిన పూజా హెగ్డే.. ఐటమ్ సాంగ్ ఒప్పుకుంది అందుకే!

టాలీవుడ్ లో పూజా హెగ్డే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది. ఒకలైలా కోసం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డేకి మొదట్లో సరిగా కలసి రాలేదు. ఆ తరువాత బాలీవుడ్ కు వెళ్లినా నిరాశే ఎదురైంది. గత ఏడాది అల్లు అర్జున సరసన నటించిన దువ్వాడ జగన్నాథం చిత్రంతో పూజ హెగ్డే జాతకం మారిందని చెప్పొచ్చు. డీజేలో పూజా అందాల హొయలు యువత ఫిదా అయ్యారు. ఒక్కసారిగా పూజా హెగ్డేకు యూత్ లో క్రేజ్ పెరింది.

ఐటమ్ సాంగ్‌కు గ్రీన్ సింగ్నల్

ఐటమ్ సాంగ్‌కు గ్రీన్ సింగ్నల్

డీజే చిత్రం తరువాత పూజా హెగ్డేకు అవకాశాలు వెల్లువెత్తాయి. స్టార్ హీరోయిన్ గా మారుతున్న తరుణంలో పూజా హెగ్డే రంగస్థలం చిత్రంలో జిగేలు రాణి ఐటెం సాంగ్ లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. జిగేలు రాజి ఐటెం సాంగ్ చేయడానికి గల కారణాలని పూజా హెగ్డే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

జిగేలు రాణితో క్రేజ్

జిగేలు రాణితో క్రేజ్

రంగస్థలం చిత్రంలో జిగేల్ రాణి ఐటెం సాంగ్ చేయడం వలన పూజా హెగ్డే క్రేజ్ మరింతగా పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే పూజా హెగ్డేలోని డాన్సింగ్ స్కిల్స్, హావ భావాలు ఈ సాంగ్ తో బయటపడ్డాయి. జిగేలు రాణి సాంగ్ అందరిని విపరీతంగా ఆకర్షించింది.

Recommended Video

Rangasthalam Movie Songs Controversy
డాన్స్ అంటే పిచ్చి

డాన్స్ అంటే పిచ్చి

తనకు చిన్నప్పటి నుంచి డాన్స్ అన్నా, సంగీతం అన్నా చాలా ఇష్టం అని పూజా హెగ్డే తెలిపింది. జిగేలు రాణి సాంగ్ జానపద గేయం తరహాలో ఉంటుంది. అందుకే ఆ సాంగ్ కు అంగీకరించానని పూజా హెగ్డే తెలిపింది. తాను అనుకున్నట్లుగానే జిగేలు రాణి సాంగ్ పెద్ద హిట్ అయిందని తెలిపింది.

అరవింద సమేతతో మరో విజయం

అరవింద సమేతతో మరో విజయం

తాజా అరవింద సమేత చిత్రంతో మరో విజయాన్ని పూజా హెగ్డే తన ఖాతాలో వేసుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X