నా స్నేహితుడిని వేధించారు.. కట్టలు తెంచుకున్న పూజ హెగ్డే కోపం!
బ్రిటిష్ ఎయిర్ వేస్ లో తరచుగా భారతీయులకు అవమానం జరుగుతోనే ఉంది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తన స్నేహితుడిని కూడా బ్రిటీష్ ఎయిర్ వేస్ వాళ్ళు వేధించారని సోషల్ మీడియా వేదికగా పూజ హెగ్డే మంది పడింది.

ఎంతటి జాత్యహంకారులు వాళ్ళు. గత రాత్రి తనకు జరిగిన ఘోర అవమానం గురించి నా స్నేహితుడు చెప్పాడు. బ్రిటిష్ ఎయిర్ వేస్ లో సిబ్బంది నా స్నేహితుడిని తీవ్రంగా వేధించారు. కేవలం గ్లాసు మంచి నీళ్లు ఇవ్వడానికి గంట సేపు వేధించారు. విదేశీయులకు మాత్రం మద్యం సరఫరా చేస్తూనే ఉన్నారు అని తన స్నేహితుడికి ఎదురైనా అవమానం గురించి పూజ హెగ్డే ఆగ్రహం వ్యక్తం చేసింది.
తరచుగా భారతీయుల్ని అవమానించే విధంగా బ్రిటిష్ ఎయిర్ వేస్ సిబ్బంది ప్రవర్తిస్తున్నారు. దీనిపై బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. బ్రిటిష్ ఎయిర్ వేస్ ని భారతీయులంతా బాయ్ కాట్ చేయాలని సూచించారు.


Click it and Unblock the Notifications











