పెద్ద హీరో కదా అని ఒప్పుకుని తప్పు చేశా, అందుకే కెరీర్ ఇలా.. పూజ హెగ్డే సంచలనం!

కెరీర్ ఆరంభంలో పూజ హెగ్డే వరుసగా పరాజయాలు ఎదుర్కొంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్నప్పటికీ ఆమె నటించిన చిత్రాలు నిరాశపరచడంతో మంచి అవకాశాలు కరువయ్యాయి. దీనితో బాలీవుడ్ లోను ప్రయత్నాలు చేసి కొన్ని చిత్రాల్లో నటించింది. అక్కడ కూడా పూజాహెగ్డేకు కలసి రాలేదు. పూజ హెగ్డే తమిళ చిత్రం మాస్క్ తో 2012లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ ఏడేళ్లలో పూజ హెగ్డే కేవలం 8 చిత్రాల్లో మాత్రమే నటించింది. మరో మూడు చిత్రాల్లో ప్రస్తుతం నటిస్తోంది. తన కెరీర్ ఇంత నెమ్మదిగా సాగడానికి తాను తీసుకున్న తప్పుడు నిర్ణయమే అని పూజా హెగ్డే అంటోంది.

ఒక లైలా కోసం చిత్రంతో

ఒక లైలా కోసం చిత్రంతో

పూజ హెగ్డే తెలుగులో నటించిన తొలి తెలుగు చిత్రం ఒక లైలా కోసం. నాగ చైతన్య సరసన పూజ హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం విజయం సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన ముకుంద చిత్రం కూడా పూజ హెగ్డేకు నిరాశనే మిగిల్చింది. వరుస పరాజయాలతో రెండేళ్ల పాటు పూజ హెగ్డే టాలీవుడ్ లో నటించలేదు. ఏ సమయంలో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన మొహంజదారో చిత్రంలో నటించే అవకాశాన్ని పూజ హెగ్డే దక్కించుకుంది.

పెద్ద హీరో అని ఒప్పుకున్నా

పెద్ద హీరో అని ఒప్పుకున్నా

మొహంజదారో భారీ బడ్జెట్ చిత్రం. పైగా స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించే ఛాన్స్. ఈ అవకాశం వదులుకోకూడదని, నిర్మాతలు అడిగిన ప్రకారం రెండేళ్ల పాటు ఈ చిత్రానికే కాల్ షీట్స్ కేటాయించా. మొహంజదారో విడుదలై తీవ్రంగా నిరాశ పరిచింది. దీనితో చాలా భాదపడ్డానని పూజ హెగ్డే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. నా కెరీర్ లో నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం అదే. రెండేళ్లు ఆ చిత్రం కోసమే సమయం వృధా చేశా. ఓ హీరోయిన్ కు రెండేళ్ల సమయం ఎంత కీలకమో ఇప్పుడు అర్థం అవుతోంది.

 కంటెంట్‌ ఉన్న చిత్రాలు

కంటెంట్‌ ఉన్న చిత్రాలు

ప్రస్తుతం హీరోయిన్లు అంటే ఏడాదికి రెండు మూడు చిత్రాల్లో నటించేస్తున్నారు. మొహంజదారోకి బదులు చిన్న చిత్రాల్లో నటించి ఉన్నా నాకు అప్పుడే మంచి గుర్తింపు లభించి ఉండేది. అందుకే ప్రస్తుతం హీరోలు, బడ్జెట్‌ని బట్టి కాకుండా కంటెంట్‌ని బట్టి చిత్రాలు ఎంచుకుంటున్నట్లు పూజా హెగ్డే వెల్లడించింది. ఇప్పుడు పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. గత ఏడాది అరవింద సమేత చిత్రంతో విజయాన్ని అందుకున్న పూజా ప్రస్తుతం మహేష్ సరసన మహర్షి, ప్రభాస్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.

క్రేజ్ పెంచిన డీజే

క్రేజ్ పెంచిన డీజే

బాలీవుడ్ లో మెహనజదారో రూపంలో పెద్ద షాక్ తగలడంతో రెండేళ్ల తర్వాత పూజా మళ్ళీ టాలీవుడ్ కే వచ్చింది. ఈ సారి అల్లు అర్జున్ సరసన డీజే చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇది పక్కా కమర్షియల్ చిత్రం కావడంతో పూజ హెగ్డే గ్లామర్ డోస్ పెంచి నటించింది. డీజేతో కుర్రకారు మొత్తం పూజ హెగ్డే అభిమానులుగా మారిపోయారు. డీజే తర్వాత పూజా హెగ్డేకు అద్భుతమైన అవకాశాలు దక్కుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X