పూజా హెగ్డే హ్యాండ్ పడింది.. ప్లాపుల హీరో రాత మారుతుందా?
ఎంత సొమ్మున్నా ఏం లాభం.. ఇసుమంతైనా అదృష్టం ఉండాలే అనేది అక్కినేని హీరో అఖిల్ కు వర్తిస్తుంది. పేరు ప్రతిష్ఠ ఉండీ కూడా అతనికి ఏం ఉపయోగ పడటం లేదు. అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇంతవరకు హిట్టు కొట్టలేకపోతున్నాడు. ఇతర హీరోలకు సక్సెస్ అందిస్తున్న పూజా హెగ్డే ఇప్పుడు అఖిల్‌కు విజయాన్ని అందిస్తుందా అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతున్నది. వరుణ్ తేజ్‌తో కలిసి పూజా హెగ్డే నటించిన వాల్మీకి (గద్దలకొండ గణేష్) కూడా విజయం దిశగా పరుగుల పెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఓ ఆసక్తికరంగా మారింది. అదేమిటంటే..

కొంతలో కొంత హలో పర్లేదనిపించినా..
అఖిల్ చిత్రం డిజాస్టర్ కావడంతో ఏం చెయ్యాలో పాలు పోని నాగార్జున.. తన కుమారుడి కెరీర్ను గాడిలో పెట్టేందుకు చాలా ప్రయత్నించాడు. చాలా గ్యాప్ తీసుకుని విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన హలో పర్వలేదనిపించింది. అయితే అక్కినేని స్థాయికి అది సరైన హిట్ కాదు.

కొత్త డైరెక్టర్ తో చేసినా కలిసి రాలేదు...
వెంకీ అట్లూరి తొలిప్రేమ చిత్రంతో తొలి ప్రయత్నంలో హిట్టు కొట్టాడు. ఇక తన రెండో ప్రయత్నంలో అఖిల్ తో మిస్టర్ మజ్ను చేశాడు. ఇందులో కామెడీ ట్రాక్ అయితే పండింది కానీ సినిమా నిరాశ పరిచింది. దీoతో అఖిల్ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. మరోసారి అఖిల్ కెర్రీర్ డైలమాలో పడింది.

ఫెయిల్యూర్ డైరెక్టర్కు ఓకే చెప్పిన అఖిల్..
ముచ్చట మూడు చిత్రాలు అనుకున్నంతగా ఆడకపోయినా.. నాల్గో సినిమాతో అయినా హిట్టు కొట్టాలని రెడీ అవుతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన కథను ఓకే చేసేశాడు. అయితే ఇంతవరకు మళ్ళీ ఒక్క అప్డేట్ కూడా రాలేదు. అసలు సినిమా ఉందా లేదా ఆగిపోయిందా అనే అనుమానాలు వచ్చాయి.

షూటింగ్ లో జాయిన్ అయిన పూజా హెగ్డే..
హిట్టు చూసి చాలా కాలమైన బొమ్మరిల్లు భాస్కర్ తో అఖిల్ చేస్తున్న తన నాల్గో చిత్రం లో పూజాహెగ్డే ను హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఇటీవలే గడ్డలకొండ గణేష్ సినిమాతో శ్రీదేవిగా మెప్పించిన పూజా.. తాజాగా ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్2 పై బన్నీ వాసు నిర్మిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











