ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా షూట్‌లో జాయిన్ అయిన హీరోయిన్!
ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ప్రారంభం అయిన ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం వుండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇటీవల ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ కోసం జిమ్ లో కసరత్తులు చేసిన సంగతి తెలిసిందే.
అజ్ఞాతవాసి చిత్రం పరాజయం చెందడంతో ఎన్టీఆర్ చిత్రంతో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం హీరోయిన్ పూజా హెగ్డే చిత్ర షూట్ లో జాయిన్ అయింది. పూజా హెగ్డే, ఎన్టీఆర్ మధ్య త్రివిక్రమ్ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. డీజే చిత్రంలో అందాల ఆరబోత తరువాత పూజా హెగ్డే కు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.

తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మరో అదిరిపోయే ఆల్బమ్ అందించే పనిలో తమన్ బిజీగా ఉన్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్ర టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది. దసరాకు చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











