ఎన్టీఆర్ యాక్టరా, డాన్సరా.. నా పేరు మీదే సినిమా.. పూజా హెగ్డే!
Recommended Video

ఎన్టీఆర్ యాక్టరా, డాన్సరా.. నా పేరు మీదే సినిమా.. పూజా హెగ్డే! అరవింద సమేత చిత్రం విజయం సాధించడంతో హీరోయిన్ పూజా హెగ్డే టాలీవుడ్ లో తొలి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. దీనితో పూజా హెగ్డే ఆనందాన్ని అవధులు లేవు. డీజే చిత్రం తరువాత పూజ హెగ్డే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అరవింద సమేత చిత్రం విజయంతో ఆమె కెరీర్ మరింతగా జోరందుకుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. విజయానందంలో ఉన్న పూజా తాజగా ఓ ఇంటర్వ్యూలో అరవింద సమేత చిత్రం గురించి స్పందించింది.

టైటిల్ చెప్పగానే
ఈ చిత్రానికి అరవింద సమేత అనే టైటిల్ పెడుతున్నట్లు దర్శకుడు త్రివిక్రమ్ చెప్పగానే చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఎన్టీఆర్ లాంటి యాక్షన్ హీరో నటిస్తున్న చిత్రానికి హీరోయిన్ పేరు వచ్చేలా అరవింద సమేత అని టైటిల్ పెట్టడంతో చాలా సంతోషంగా అనిపించింది.

అరవింద లాగే ఉంటా
నేను రియల్ లైఫ్ లో కూడా అరవింద లాగే ఉంటా. పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నా పాత్ర గురించి చాలా బాగా వివరించారు. అందువలన అరవింద పాత్రలో నటించడం చాలా సులువైంది పూజా హెగ్డే తెలిపింది.

ఎన్టీఆర్ యాక్టరా, డాన్సరా
ఎన్టీఆర్ గొప్ప నటుడా, గొప్ప డాన్సరా అనే ప్రశ్నకు పూజా హెగ్డే ఆసక్తికర సమాధానం ఇచ్చింది. సందేహం లేకుండా ఎన్టీఆర్ గొప్ప నటుడు అని పూజా హెగ్డే సమాధానం ఇచ్చింది. అదే సమయంలో ఎన్టీఆర్ అద్భుతమైన డాన్సర్ అని కూడా తెలిపింది. కానీ అరవింద సమేత చిత్రంలో పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ ని నటుడిగానే చూస్తారని తెలిపింది.

క్రేజీ హీరోయిన్
ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా హెగ్డే అద్భుతమైన అవకాశాలతో దూసుకుపోతోంది. వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ సరసన పూజ హెగ్డే మహర్షి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కొత్త చిత్రంలో కూడా పూజానే హీరోయిన్.


Click it and Unblock the Notifications











