twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబ్బిస్తాం.. అలా చేయమని అడిగారు, కానీ నేనలాంటి దాన్ని కాదు: పూజా హెగ్డే

    |

    మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్ రిలీజ్ చేస్తున్నారంటే.. జనాలను ఆకర్షించడం కోసం ఆయా కంపెనీలు మార్కెటింగ్ జిమ్మిక్కులు ప్రదర్శిస్తుంటాయి. అందులో మరీ ముఖ్యమైనది.. దానికొక యాడ్ రూపొందించి ఓ స్టార్ ఫేస్ తగిలించడం.

    ప్రొడక్ట్ సంగతి పక్కనబెడితే.. ఆ స్టార్ వాల్యూ చూసే.. దాన్ని కొనుక్కోవడానికి సిద్దమైపోయేవాళ్లు చాలామందే ఉంటారు. తీరా అది నకిలీ అని తెలిశాక మోసపోయామని గ్రహిస్తారు. ఆ యాడ్స్ లో నటించే స్టార్స్ బాధ్యతారాహిత్యం కూడా ఇందుకు ప్రధాన కారణం. అయితే తాను మాత్రం అలాంటి దాన్ని కాదంటోంది హీరోయిన్ 'పూజా హెగ్డే'.

    రిజెక్ట్ చేసిన పూజా:

    రిజెక్ట్ చేసిన పూజా:

    ఓ ప్రముఖ సంస్థ ప్రతినిధులు ఇటీవల పూజా హెగ్డేను కలిసి తమ 'వెయిట్ లాస్ ప్రొడక్ట్‌'ను ప్రమోట్ చేయాలని కోరారట. ఇందుకోసం భారీ పారితోషికం కూడా ఆఫర్ చేశారట. అయితే పూజా మాత్రం సున్నితంగా ఆ ఆఫర్ ను తిరస్కరించారు.

    డబ్బు కోసం.. నేనలా చేయను:

    డబ్బు కోసం.. నేనలా చేయను:

    డబ్బు కోసం తాను ఏది పడితే అది చేయనని పూజా హెగ్డే చెబుతున్నారు. ట్యాబ్లెట్స్ వాడటం వల్ల బరువు తగ్గుతారని మిస్ గైడ్ చేయడం తనకిష్టం లేదని అంటున్నారు. ఒక నటిగా తాను చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని పూజా పరోక్షంగా చెప్పారనుకోవాలి.

    అదే బెటర్:

    అదే బెటర్:

    రోజూ కనీసం 45నిమిషాలు వ్యాయామం చేయడం.. స్ట్రిక్ట్‌ డైట్, యోగతో లైఫ్‌స్టైల్‌ చేంజ్‌ చేసుకుంటే.. బరువు తగ్గడం పెద్ద విషయం కాదంటున్నారు. బరువు తగ్గడానికి సహజ పద్దతిని అనుసరించడమే అన్ని విధాలా మేలు అని చెబుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సంగతి ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాలంటున్నారు.

    పూజా హెగ్డే సినిమాలు:

    పూజా హెగ్డే సినిమాలు:

    తెలుగులో పూజా హెగ్డే చేసిన 'ఒక లైలా కోసం', 'ముకుందా' వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ.. డీజేతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఓ సినిమాలో నటిస్తున్నారు. అటు రాంచరణ్ రంగస్థలంలోను ఓ ఐటెం సాంగ్‌లో నటిస్తున్నారు.

    English summary
    Pooja was offered to endorse weight loss bills by a reputed pharmaceutical company. But the talented actress refused it, aware of the side effects in the wake of the unnatural weight loss treatment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X