»   » బికినీ భామ పూజాహెగ్గే అంటే మజాకా?.. వరుసగా ముగ్గురు హీరోలు క్లీన్‌బౌల్డ్!

బికినీ భామ పూజాహెగ్గే అంటే మజాకా?.. వరుసగా ముగ్గురు హీరోలు క్లీన్‌బౌల్డ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

దువ్వాడ జగన్నాథం చిత్రంలో హాట్‌హాట్‌గా నటించిన తర్వాత అందాల తార పూజా హెగ్డే గ్రాఫ్ యమా దూసుకెళ్తున్నది. డీజే చిత్రంలో బికినీ ధరించి హాట్‌హాట్‌గా నటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు వరకు హీరోలను పెద్దగా ఆకట్టుకోలేని పూజా ఇప్పుడు ఏకంగా ముగ్గురు టాలీవుడ్ సూపర్‌స్టార్లతో నటించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ప్రభాస్‌తో జతకట్టడానికి సిద్ధమైందనే వార్త వైరల్ అయి కూర్చున్నది.

 సాహో కోసం పూజా హెగ్డే పేరు

సాహో కోసం పూజా హెగ్డే పేరు

బాహుబలి తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సాహో చిత్రంలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రంలో పూజా హెగ్డే పేరును పరిశీలించారు. అయితే ఆ అవకాశాన్ని బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ తన్నుకెళ్లింది. దాంతో ఈ అమ్ముడు కొంత నిరాశకు గురైనట్టు వార్తలు వచ్చాయి.

సాహో సినిమా తర్వాత ప్రభాస్‌తో

సాహో సినిమా తర్వాత ప్రభాస్‌తో

కానీ ప్రభాస్‌తో నటించే అవకాశం వెంటనే రావడంతో పూజా హెగ్డే ఎగిరి గంతేసిందట. సాహో తర్వాత రూపొందే ప్రభాస్ తదుపరి చిత్రంలో నటించేందుకు పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. దాంతో ప్రభాస్ పక్కన నటించే కోరిక ఈ సినిమాతో తీరనున్నది.

అధికారికంగా ప్రకటన

అధికారికంగా ప్రకటన

ప్రభాస్ తదుపరి చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో తాను నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం 2018 జూన్, జూలై మాసంలో సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక విభాగాల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Pooja Hegde As Item Girl For This Hero
ఎన్టీఆర్, మహేష్‌తో

ఎన్టీఆర్, మహేష్‌తో

డీజే తర్వాత పూజా హెగ్డే దుమ్ము లేపేస్తున్నది. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించే చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్నది. అలాగే వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో రూపొందే మహేష్‌బాబు చిత్రంలో కూడా హీరోయిన్‌గా కనిపిస్తారు.

English summary
Earlier, Pooja Hegde had missed chances to teaming up with Prabhas for the much-anticipated film Saaho. However, Pooja couldn't bag the film. Nevertheless, according to latest reports, she has gotten a chance to work with the Baahubali actor again. According to a reports, Pooja will next be seen romancing Prabhas in a romantic film, which will be directed by Radha Krishna Kumar. The actress confirmed the report. The film is expected to go on floors in mid 2018.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu