ఎన్టీఆర్ భయపెట్టేశాడు.. స్విట్జర్లాండ్‌‌లో అలా జరిగిందంటున్న పూజ హెగ్డే, వీడియో ఇదే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత చిత్రం ఘనవిజయం సాధించింది. గత ఏడాది దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా అరవింద సమేత నిలిచింది. టాలీవుడ్ లో ఓ భారీ విజయం కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే కోరిక కూడా ఈ చిత్రంతో నెరవేరింది. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న పూజా హెగ్డే అరవింద సమేత చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన ఓ సరదా ఘటనని అభిమానులతో పంచుకుంది.

 స్విట్జర్లాండ్‌‌లో

స్విట్జర్లాండ్‌‌లో

అరవింద సమేత షూటింగ్ కోసం గత ఏడాది చిత్ర యూనిట్ స్విట్జర్లాండ్ వెళ్ళింది. మధ్యలో ఎన్టీఆర్, పూజా హెగ్డే సైకిల్ తొక్కుతూ సరదాగా కనిపించారు. ఓ అందమైన చెరువు పక్కనే తామిద్దరం సైకిల్ తొక్కినట్లు పూజా హెగ్డే తెలిపింది. కానీ ఒక్కసారిగా ఎన్టీఆర్ మా ఫోటోగ్రాఫర్ ని బయపెట్టేశాడు. సైకిల్ తొక్కుతూ తొక్కుతూ ఫోటోగ్రాఫర్ కు సమీపంగా వెళ్ళాడు. ఎన్టీఆర్ ఎక్కడ ఢీ కొడతాడో అని తామంతా భయపడ్డట్లు పూజా హెగ్డే తెలిపింది.

ఆకట్టుకుంటున్న వీడియో

ఆ వీడియోని పూజ హెగ్డే సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. పూజ హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అల్లు అర్జున్ సరసన నటించిన డీజే చిత్రంతో అందాలు ఆరబోసి యువతని ఫిదా చేసింది. అరవింద సమేత చిత్రం కూడా విజయం సాధించడంతో దర్శకనిర్మాతలు ప్రస్తుతం పూజా హెగ్డే వైపు చూస్తున్నారు. మహర్షి, ప్రభాస్ సరసన ఓ చిత్రంతో పూజా బిజీగా గడుపుతోంది.

 రాయలసీమ నేపథ్యంలో

రాయలసీమ నేపథ్యంలో

అరవింద సమేత చిత్రాన్ని త్రివిక్రమ్ రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్, యాస అన్ని అభిమానులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం దాదాపు 90 కోట్ల వరకు వసూళ్లు సాధించిన ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

 బ్రేక్ దొరికింది

బ్రేక్ దొరికింది

అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్ కలసి నటిస్తున్నారు. నవంబర్లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. ఎట్టకేలకు రాజమౌళి షూటింగ్ నుంచి ఎన్టీఆర్ కాస్త విరామం ఇచ్చాడట. ఎన్టీఆర్ ఈ చిత్రంలో భిన్నమైన లుక్ లో కనిపించబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X