మనకంటూ ఓ గుర్తింపు రావాలంటే అలా చేయక తప్పదు.. పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ పూజా హెగ్డే టైమ్ బాగా నడుస్తోంది. 'ముకుంద' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇటీవలే గద్దలకొండ గణేష్ సినిమాలో నటించి యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ భామ వరుసపెట్టి స్టార్ హీరోల సరసన రొమాన్స్ చేసే ఛాన్సులు పట్టేస్తోంది. ఈ పరిస్థితుల్లో మీడియాతో కాసేపు ముచ్చటించిన పూజా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. వివరాల్లోకి పోతే..

అలాంటి వాటి పట్ల ఎప్పుడూ ముందే ఉంటా..
డిసీజన్ మేకింగ్ లో తాను చాలా యాక్టివ్ అంటోంది పూజా. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు తాను ఎప్పుడూ వెంకటాడనని అంటోంది ఈ గ్లామర్ బ్యూటీ. జీవితంలో సాహసాలు చేయడం చాలా అవసరమని, అవే మనల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయని చెబుతోంది పూజా.

తప్పు లేదు.. కానీ, గుర్తింపు రావాలంటే మాత్రం..
నిజ జీవితంలో కంఫర్టబుల్‌గా బతకడంలోనే అసలైన ఆనందం ఉందని అందరూ భావిస్తుంటారని, అందులో భాగంగానే ఒకే రకమైన లైఫ్‌కు అలవాటు పడిపోతుంటారని చెప్పుకొచ్చింది పూజా. అయితే అలా బతకడంలో తప్పు లేదు కానీ మనకంటూ ఓ గుర్తింపు రావాలంటే మాత్రం అందరిలో భిన్నంగా ఉండాల్సిందే, అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందే అనేసింది పూజా హెగ్డే.

పూజా జీవిత పాఠాలు.. అబ్బో! మామూలుగా లేవండీ బాబు
మనం కొత్తగా ప్రయత్నిస్తే ఎదురుదెబ్బలు తగలడం కామనే అని చెప్పిన పూజా.. వాటిని తట్టుకుని నిలబడ్డప్పుడే మన ప్రత్యేకత తెలుస్తుందని అంటోంది. పదిమందికంటే మనం భిన్నంగా ఆలోచించాల్సిందే అప్పుడే అసలైన గుర్తింపు అని బల్లగుద్ది మరీ చెబుతోంది ఈ యంగ్ హీరోయిన్. ఈమె చేసిన ఈ కామెంట్స్ చూసి పూజా జీవిత పాఠాలు.. అబ్బో! మామూలుగా లేవండీ బాబు అంటున్నారు నెటిజన్లు.

పూజా సినిమా జర్నీ
అల్లు అర్జున్ సరసన 'డీజే' సినిమాలో హాట్ హాట్‌గా అదరగొట్టిన పూజా హెగ్డే.. ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత' సినిమాలో, ఆ తర్వాత మహేష్ బాబుతో కలసి ‘మహర్షి' సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన 'అల.. వైకుంఠపురములో' సినిమాలో నటిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Recommended Video

సరిలేరు నీకెవ్వరులో పూజా మెరుపులు
ఇక మహేష్ బాబు లేటెస్ట్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'లో కూడా పూజా హెగ్డే ఓ ఐటెం సాంగ్ చేస్తోందని తెలుస్తోంది. గతంలో రంగస్థలం సినిమాలో ఐటెం సాంగ్ చేసిన ఈమె 'సరిలేరు నీకెవ్వరు'లో అంతకు మించి పెర్ఫార్మ్ చేస్తోందని సమాచారం.


Click it and Unblock the Notifications











