ప్రభాస్ లాంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదట.. యూరోపియన్ పీరియడ్ సినిమా.. పూజా హెగ్డే!
Recommended Video
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు సాహో షూటింగ్ జరుగుతుండగానే ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రారంభించాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే జోడిగా ఓ చిత్రం ప్రారంభమైంది. ఇటలీలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించారు. 1960. 70 నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జాన్, అమూర్ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. తాజాగా పూజ హెగ్డే ప్రభాస్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

రెండు షెడ్యూల్స్ కంప్లీట్
పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేశాం. తదుపరి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. గతంలో ఎన్నడూ చూడని అంశాలు ఈ చిత్రంలో తెరక్కిస్తున్నట్లు పూజా హెగ్డే తెలిపింది. యూరోపియన్ పీరియడ్ డ్రామాగా ఈ చిత్రం భారీ స్థాయిలో ఉంటుందని పూజా హెగ్డే తెలిపింది.

ప్రభాస్ లాంటి వ్యక్తిని
ప్రభాస్ గురించి మాట్లాడుతూ పూజా హెగ్డే అతడిని ప్రశంసల్లో ముంచెత్తింది. ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్.. అతడి లాంటి మంచి మనిషిని ఇంతవరకూ చూడలేదు. ప్రభాస్ చాలా పెద్ద స్టార్.. అయినా కూడా అందరితో మర్యాదగా, పద్దతిగా మెలగడం చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది అని పూజా హెగ్డే ప్రభాస్ పై ప్రశంసలు కురిపించింది.

క్రేజీ హీరోయిన్
పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. బడా స్టార్ల సరసన వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. డీజే చిత్రంలో పూజా హెగ్డే అందానికి యువత ఫిదా అయ్యారు. ఆ తర్వాత పూజా హెగ్డే అరవింద సమేత చిత్రంతో ఎన్టీఆర్ సరసన నటించి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం మహర్షి చిత్రంలో, ప్రభాస్ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ సరసన రెండోసారి నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

2020లో విడుదల
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది ఆగష్టులో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సాహో చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర చివరిదశ షూటింగ్ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











