సూపర్‌స్టార్‌ను పట్టేసిన పూజా హెగ్డే.. షాకింగ్‌గా రెమ్యునరేషన్‌.. బ్యూటీ డిమాండ్‌కు నిర్మాతలు ఒకే!

మాస్టర్ సినిమా తర్వాత ఇళయ దళపతి, సూపర్ స్టార్ విజయ్ కొత్త సినిమాపై వేగం పెంచారు. సినిమా సెట్స్‌లోకి వెళ్లకముందే #Thalapathy65 మూవీ అనేక ఆసక్తికరమైన విషయాలకు వేదికగా మారింది. ఈ చిత్రంలో నటించే యాక్టర్ల ఎంపిక ప్రస్తుతం దక్షిణాదిలో చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

ముదురు భామ అందాలు మాములుగా లేవు: మాల్దీవుల్లో బాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

విజయ్‌ మూవీలో నవాజుద్దీన్ సిద్దిఖీ

విజయ్‌ మూవీలో నవాజుద్దీన్ సిద్దిఖీ

విజయ్ కెరీర్‌లో 65వ చిత్రంగా రూపొందుతున్న చిత్రంపై భారీగా బజ్ క్రియేట్ అవుతున్నది. ఈ చిత్రానికి నెల్సన్ దిలిప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖిను విలన్‌ పాత్ర కోసం ఎంపిక చేశారనే వార్త వైరల్‌గా మారింది.

 పూజా హెగ్డేకు భారీ ఆఫర్

పూజా హెగ్డేకు భారీ ఆఫర్

ఇక నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ ప్రాజెక్టులోకి వచ్చిన వార్త ఓ వైపు సంచలనం రేపగా, హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక మరో సెన్సేషన్‌గా మారింది. అయితే విజయ్ సరసన నటించడానికి నిర్మాతలు భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే దక్షిణాదిలో టాప్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా పూజా హెగ్డే పారితోషికం తీసుకొన్నట్టు ఓ వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

పూజా రెమ్యునరేషన్ ఎంతంటే

పూజా రెమ్యునరేషన్ ఎంతంటే

విజయ్‌తో నటించబోయే చిత్రం కోసం పూజా హెగ్డే సుమారు 2.5 కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేయగా అందుకు నిర్మాతలు అంగీకరించినట్టు తెలుస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను, పూజా హెగ్డే ఎంపిక విషయాన్ని త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించనున్నట్టు తెలిసింది.

నయనతార, సమంత తర్వాత

నయనతార, సమంత తర్వాత

ఇక దక్షిణాదిలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్ల జాబితాలో పూజాహెగ్డే చేరిపోయిందనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సౌత్‌లో నయనతార అత్యధికంగా రూ.6 కోట్లు, సమంత రూ.4 కోట్ల వరకు తీసుకొంటారనే విషయం ప్రచారంలో ఉంది. ఆ తర్వాత పూజా హెగ్గే ఆ ఘనతను సొంతం చేసుకొందనే వార్త వినిపిస్తున్నది.

పూజా హెగ్డే నటించే సినిమాలు

పూజా హెగ్డే నటించే సినిమాలు

పూజా హెగ్డే కెరీర్ గ్రాఫ్ విషయానికి వస్తే.. తెలుగులో ఆమె నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్ చిత్రాలు రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. ప్రస్తుతం పూజా నటిస్తున్న సర్కస్, ఆచార్య చిత్రాలు షూటింగు దశలో ఉన్నాయి. హిందీలో సల్మాన్ ఖాన్‌తో కభీ ఈద్ కభీ దీవాళి చిత్రానికి ఒకే చెప్పింది. ఇంకా బాలీవుడ్, టాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X