ధోనీపై పూజా హెగ్డే కామెంట్.. చురకలంటించిన నెటిజన్స్

Recommended Video

ICC Cricket World Cup 2019 : Pooja Hegde Faces The Heat Post Her Emotional Tweet On MS Dhoni

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో మంచి జోష్‌లో ఉంది పూజా హెగ్డే. అరవింద సమేత, మహర్షి రూపంలో వరుస హిట్స్ ఖాతాలో వేసుకున్న ఈమె తాజాగా నెటిజన్స్ ట్రోలింగ్‌కి గురైంది. టీమ్ ఇండియా ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆమె చేసిన కామెంట్ పై విరుచుకు పడుతూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.

సెమీ ఫైనల్‌లో భారత జట్టు

సెమీ ఫైనల్‌లో భారత జట్టు

నిన్న (జులై 10) వ తేదీన జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో భారత జట్టుపై న్యూజిలాండ్ జట్టు విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. చివరిదాకా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ధోని, రవీంద్ర జడేజా పార్ట్‌నర్‌షిప్ ఒక్కటే చెప్పుకోదగినది. టీమ్ ఇండియా జోష్ చూసి ఈ సారి వరల్డ్ కప్ భారత జట్టుదే అని ఫిక్స్ అయ్యారంతా. కానీ ఊహించని రీతిలో ఇండియా టీమ్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు క్రీడాభిమానులు. సరిగ్గా ఈ తరుణంలో ధోనీపై కామెంట్ చేసి ఇరుక్కుపోయింది పూజా హెగ్డే.

ఇండియా ఓడిపోయాక పూజా హెగ్డే ట్వీట్

ఇండియా ఓడిపోయాక ట్వీట్ చేసిన పూజా.. ''భారత జట్టు పరాజయం పాలవడం తట్టుకోలేక పోతున్నా. బట్ ధోనీ బాగా ఆడాడు. మరోసారి ఈ మ్యాచ్ ద్వారా అతనే నా ఫేవరేట్ ఎందుకయ్యాడనేది ప్రూవ్ చేశాడు. ప్రతీ మ్యాచ్‌లో భారత విజయం కోసం పోరాడతారు ధోనీ. అతనంటే నాకు చాలా ఇష్టం'' అని పేర్కొంది. ఇదే ట్వీట్ నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది.

ధోనీ సాధించిన ఘనత ఏంటో!

ధోనీ సాధించిన ఘనత ఏంటో!

నిజానికి భారత జట్టు 18 పరుగులతో ఓడిపోవడంతో పరోక్షంగా కారణమయ్యాడు ధోనీ. చివరిదాకా పోరాడిన ఆయన రన్ అవుట్ కాకపోయి ఉంటే భారత జట్టు గెలిచే అవకాశం ఉండేది. ఇవే అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ వరల్డ్ కప్‌లో ధోనీ సాధించిన ఘనత ఏంటో! ఎందుకంతగా పొడుగుతున్నావ్ పూజా అంటూ ఆమెకు చురకలంటిస్తున్నారు నెటిజన్లు.

పూజా హెగ్డే సినిమాలు

పూజా హెగ్డే సినిమాలు

ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రాబోతున్న మరో సినిమాలో కూడా భాగమవుతోంది పూజా. ఇదిగాక బాలీవుడ్ మూవీ హౌస్ ఫుల్ 4 లో కూడా ఓ హీరోయిన్‌గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X